Delhi court: బహిరంగంగా ‘‘పొట్టి దుస్తులు’’ ధరించడం నేరం కాదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. గత ఏడాది బార్‌లో అశ్లీల నృత్యం చేసినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురు బార్ డ్యాన్సర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చిన కోర్టు.. డ్యాన్స్ వల్ల ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది.
ఆ మహిళలపై పహార్ గంజ్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 294 (అశ్లీల చర్యలు) కింద అభియోగాలు మోపారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులు బార్‌లో డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించి ‘‘అశ్లీల పాటలకు’’ డ్యాన్స్ చేస్తుున్నారని ఎస్ఐ ధర్మేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Also: High Court: భర్త, సహోద్యోగి మధ్య స్నేహం ‘‘వివాహేతర సంబంధమేనా’’..? భార్య ఆరోపణలపై హైకోర్ట్..
అయితే, ఈ కేసులో సాక్ష్యాలు అందంచడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇద్దరు ప్రాసిక్యూషన్ సాక్షులు తాము ఆనందం కోసం బార్‌కి వెళ్లామని, కేసు గురించి తమకు ఏమీ తెలియదని చెప్పారని కోర్టులో చెప్పారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్నానని చూపించడానికి, పోలీస్ ఎలాంటి ఆధారాలు అందించలేదని కోర్టు హైలెట్ చేసింది. అతడి స్టేట్మెంట్‌కి మద్దతు ఇచ్చే డ్యూటీ రోస్టర్ లేదా ఇతర ఏదైనా సంబంధిత పత్రాలు లేనప్పుడు, పోలీసులు మౌఖిక స్టేట్మెంట్‌కి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది.
ప్రాసిక్యూషన్ కథనంపై కోర్టు అనుమానం వ్యక్తం చేస్తూ, ఎలాంటి నమ్మకమైన సాక్షలను అందించడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు నమ్మదగిన సాక్షులు కాదని, కల్పిత కథనాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.