Mood of the Nation: మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN) పోల్‌లో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికి ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 343 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది.
Mood of the Nation poll: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి ఘన విజయం సాధిస్తుందని సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 33-35 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీయే ఓట్ల శాతం 47 నుంచి 52 శాతానికి పెరుగుతుందని అంచనా. బీహార్‌లో ఎన్డీయే తన పట్టును నిలుపుకుంటుందని చెప్పింది.
India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన సర్కార్‌లోని విద్యార్థి నేతలు, జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన నేతలు మతోన్మాద వ్యాఖ్యలు చేస్తూ, అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. హిందువులు, భారత్‌కి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తనకు చేసిన అన్యాయాలను మరిచిపోయి పాకిస్తాన్‌తో స్నేహం…
Allahabad HC: లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తన గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునే హక్కును చట్టం కల్పిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కామెంట్స్ చేసింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.
INDIA Alliance: ఢిల్లీలో ఆప్ ఓటమి ఇండియా కూటమిలో విభేదాలను సృష్టించింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ఆప్, కాంగ్రెస్ మధ్య పొగడం లేదు. ఢిల్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని కాదని టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు ఆప్‌కి మద్దతు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. దీంతో ఇండియా కూటమిలో పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఆప్ ఓటమి తర్వాత కూటమి పార్టీలన్నీ ఇద్దరు కలిసి పోటీ చేయకపోవడాన్ని […]
Mamata Banerjee: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద […]
Abhijit Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కొంతకాలంగా పని చేస్తున్న ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. బుధవారం, కోల్‌కతాలో AICC ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, ఇతర రాష్ట్ర నాయకుల సమక్షంలో అభిజిత్ అధికారికంగా పార్టీలో తిరిగి చేరారు. 2021లో కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, తిరిగి రావడాన్ని సొంతింటికి వస్తున్నట్లుగా అభివర్ణించారు.
Savarkar: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజలు పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లారు. ఈ రోజు మార్సెయిల్ నగరంలో భారత కాన్సులేట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ప్రారంభించారు.
Amartya Sen: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోరాడాల్సిందని ప్రముఖ నోబెల్ అవార్డ్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని తన పూర్వీకులు ఇంట్లో ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతదేశం లౌకికవాదం మనుగడ సాగించాలంటే, ఐక్యత మాత్రమే కాకుండా, భారతదేశాన్ని బహుత్వానికి అద్భుతమైన ఉదాహరణగా మార్చిన విషయాలపై ఒప్పందం ఉండాలని అన్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఐక్యత అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. Read Also: Anji Reddy Chinnamile […]
Racist comments: భారత సంతతికి చెందిన మహిళను ఉద్దేశిస్తూ ఇంగ్లాండ్ వ్యక్తి చేసిన ‘‘జాతి విద్వేష వ్యాఖ్యలు’’ వైరల్‌గా మారాయి. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తప్పతాగి ఉన్న వ్యక్తి భారత్‌తో పాటు ఆ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లండన్ నుంచి మాంచెస్టర్‌కి రైలులో వెళ్తున్న క్రమంలో 26 ఏళ్ల భారత సంతతి మహిళ గాబ్రియెల్ ఫోర్సిత్ జాతివిద్వేషాన్ని ఎదుర్కొన్నారు.