Goa: బీచ్ షాక్స్‌లో ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు కూడా గోవాలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో గురువారం అన్నారు. ఉత్తర గోవాలోని కలంగూట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాకు తక్కువ మంది విదేశాయులు వస్తే ప్రభుత్వాన్ని మాత్రమే నిందిచలేమని, అందరు వాటాదారులకు సమాన బాధ్యత ఉంటుందని చెప్పారు. గోవా వాసులు తమ బీచ్ షాకులను ఇతర ప్రాంతాల వ్యాపారవేత్తలకు అద్దెకు ఇస్తున్నారని లోబో విచారం వ్యక్తం చేశారు.
Delimitation: ప్రస్తుతం ‘‘డీలిమిటేషన్’’ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ‘‘జనాభా నియంత్రణ’’ పద్ధతులు పాటించడం ద్వారా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Bird Flu: ఇటీవల కాలంలో "బర్డ్ ఫ్లూ" ప్రపంచాన్ని భయపెడుతుంది. H5N1 బర్డ్ ఫ్లూ కేసులు పలు దేశాల్లో నమోదు అయ్యాయి. ముఖ్యంగా మానవుడికి బర్డ్ ఫ్లూ సోకడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాబోయే కాలంలో సంభావ్య ‘‘మహమ్మారి’’గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా ఒక అధ్యయనంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Trump "Gold Card": డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్‌ని ప్రకటించి, మరో సంచలనానికి తెరతీశారు. తాజాగా, ఈ గోల్డ్ కార్డ్ భారతీయులకు వరంగా ట్రంప్ చెబుతున్నారు. భారతదేశాల నుంచి వచ్చే తెలివైన విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు గోల్డ్ కార్డ్ పనిచేస్తుందని అన్నారు. వారిని నియమించుకునే కంపెనీలు గోల్డ్ కార్డ్‌ని కొనుగోలు చేయడం ద్వారా వారిని ఇక్కడే ఉంచొచ్చని ట్రంప్ చెప్పాడు.
Karnataka: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు ఒంట్లోకి చేరుతాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వ్యాఖ్యలు చేసిన తర్వాత, కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. రాష్ట్రవ్యాప్తంగా 52 హోటళ్లలో ఇడ్లీలు తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని కర్ణాటక ఆహార భద్రతా విభాగం కనుగొన్నట్లు మంత్రి దినేష్ గుండూ రావు గురువారం తెలిపారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
Shocking Survey: కేంద్రం విడుదల చేసిన టైమ్ యూజ్ సర్వే 2024లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సర్వేలో తేలింది. స్వీయ సంరక్షణ, నిర్వహణపై తక్కువ సమయం గడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ సర్వే ప్రకారం.. రోజులో ఉపాధి, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పురుషులు, మహిళలు(15-59 సంవత్సరాలు) పాల్గొనడటం 75 శాతం, 25 శాతానికి పెరిగింది. ఇది 2019లో 70.9 శాతం, 21.8 శాతంగా ఉండేది.
MK Stalin: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ‘‘హిందీ’’ వివాదం ముదురుతోంది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ విమర్శిస్తున్నారు. తమ రాష్ట్రంలో తమిళ, ఇంగ్లీష్ కలిగిన ‘‘ద్విభాషా విధానం’’కి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అయితే, ఎంకే స్టాలిన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తోంది. అన్ని భాషల్ని ఇష్టపూర్వకంగా నేర్చుకునే హక్కు అందరికి ఉంటుందని చెబుతోంది.
USA: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్, రష్యాల మధ్య స్నేహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలుమార్లు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో ట్రంప్‌కి పొసగడం లేదు. ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్, ట్రంప్ మార్గాలను వెతుకుతున్నారు.
DK Shivakumar: కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది. హస్తం పార్టీలో ఎంపీ శశిథరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు కలకలం రేపుతున్నారు. వీరిద్దరు బీజేపీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇషాఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమానికి డీకే శివకుమార్ వెళ్లడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ఈయన ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లడం కూడా వివాదాస్పదమైంది.