Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..
- సంచలనంగా మారిన ట్రంప్ ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం..
- భారతీయులకు ఉపయోగపడుతుందని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump “Gold Card”: డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్‌ని ప్రకటించి, మరో సంచలనానికి తెరతీశారు. తాజాగా, ఈ గోల్డ్ కార్డ్ భారతీయులకు వరంగా ట్రంప్ చెబుతున్నారు. భారతదేశాల నుంచి వచ్చే తెలివైన విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు గోల్డ్ కార్డ్ పనిచేస్తుందని అన్నారు. వారిని నియమించుకునే కంపెనీలు గోల్డ్ కార్డ్‌ని కొనుగోలు చేయడం ద్వారా వారిని ఇక్కడే ఉంచొచ్చని ట్రంప్ చెప్పాడు.
కొత్తగా తీసుకువచ్చిన ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం కింద అమెరికన్ కంపెనీలు అమెరికన్ యూనివర్సిటీల నుంచి భారత గ్రాడ్యుయేట్లను నియమించుకోగలవని బుధవారం చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ పాలసీ అంతర్జాతీయ ప్రతిభ, ముఖ్యంగా భారతీయులు ఎలా అమెరికాలో ఉండకుండా చేసిందనే విషయాన్ని ట్రంప్ హైలెట్ చేశారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..
‘‘ఒక వ్యక్తి భారతదేశంలో, చైనా, జపాన్, అనేక ప్రాంతాల నుంచి హార్వర్డ్, వార్టన్ స్కూల్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు వెళతారు. వారికి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. కానీ ఆ వ్యక్తి యూఎస్‌లో ఉంటాడో లేదో అనే విషయం తెలియక ఆఫర్ వెంటనే రద్దు చేయబడుతుంది’’ అని ట్రంప్ అన్నారు. ఇలా అమెరికా నుంచి వెళ్లిన చాలా మంది వారి సొంత దేశాల్లో విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారారని చెప్పారు. ‘‘వారు ఇండియా వెళతారు, లేదా వారు వచ్చిన దేశానికి తిరిగి వెళ్లారు. అక్కడ కంపెనీ తెరుస్తారు. బిలియనీర్లు అవుతారు. వారు వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు.’’ ఇలా అమెరికాలో ఆర్థిక అవకాశాలు మిస్ అవుతాయని ట్రంప్ అన్నారు. గోల్డ్ కార్డ్ అమెరికాలో ఇలాంటి ప్రతిభావంతులకు దీర్ఘకాలిక నివాసం, పౌరసత్వాన్ని అందిస్తుందని ట్రంప్ చెబుతున్నారు. దీనిని అమెరికా ఆదాయాన్ని పెంచే మరో మార్గంగా అభివర్ణించారు.
ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్ ఏమిటి??
యూఎస్ పౌరసత్వాన్ని అమ్మడమే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్. 5 మిలియన్ డాలర్లను చెల్లించడం ద్వారా ఈ గోల్డ్ కార్డ్ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఇది చట్టబద్దమైన వలసకు కొత్త మార్గం చూపిస్తోంది. మంగళవారం దీనిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు.
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!