Shivling: శివరాత్రి పండగకు ముందు గుజరాత్‌లోని ద్వారకలోని ఒక ఆలయం నుంచి శివలింగం దొంగతనానికి గురైంది. ఈ వార్త సంచలనంగా మారడంతో, అధికారులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారించారు. దర్యాప్తు సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా, తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. ఈ కేసులో కుటుంబంలోని 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే, తమ కుటుంబంలోని ఒక అమ్మాయికి కల […]
Trump Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అమెరికాతో ఉక్రెయిన్ మినరల్ డీల్‌లో భాగంగా జెలెన్స్కీ వైట్‌హౌజ్ వెళ్లారు. ఇరువురు నేతలు సమావేశమైన సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ట్రంప్ బిగ్గరగా మాట్లాడుతూ.. ‘‘మీరు ఒక ఒప్పందం కుదుర్చుకోండి. లేదంటే మేము బయటకు వెళ్లిపోతాం’’ అని అన్నారు. ‘‘నువ్వు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాము. నీవు ఇందులో గెలవలేకపోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
Bangladesh: వివాదాస్పద బంగ్లాదేశ్ విద్యార్థి నేత, గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఎగిసిపడేందుకు కారణమైన విద్యార్థి నేత నహిద్ ఇస్లాం కొత్త రాజకీయ పార్టీని శుక్రవారం ప్రారంభించాడు. ఇతనే షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంలో, హసీనా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు.
BJP: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యవహారం కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ఆయన బీజేపీకి చేరుతారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనల్ని డీకే శివకుమార్ కొట్టిపారేసినప్పటికీ, సొంత పార్టీలోని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన మహా కుంభమేళాకు వెళ్లడం, శివరాత్రి రోజున కోయంబత్తూర్‌లో మతపరమైన కార్యక్రమానికి హాజరుకావడంతో బీజేపీకి దగ్గరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్‌గా ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు.
Tamil Nadu: తమిళనాడు ఈరోడ్ జిల్లాలో ఒక ఆలయంలో సింగిల్ నిమ్మకాయకు రికార్డ్ ధర రూ. 13,000 పలికింది. శివరాత్రి పర్వదినాన ఆలయంలో పవిత్రంగా భావించే నిమ్మకాయ కోసం భక్తులు పోటీ పడుతుంటారు. నిమ్మకాయకు ప్రతీ ఏడాది వేలం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే వేలంలో రికార్డ్ ధర పలికినట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
Himachal: నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది. అయితే, దీనిపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ, ఈ విరాళం స్వచ్ఛందంగా అందించబడిందని, ఇది సుఖ్ ఆశ్రయ్ పథకం కింద అనాథలకు భవన నిర్మాణ సౌకర్యాల కోసం అని చెప్పారు.
Fahad Ahmad: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) నాయకుడు, వివాదాస్పద బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌కి పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఎన్సీపీ(ఎస్పీ) యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జితేంద్రం అహ్వాద్ సిఫారసు మేరకు శరద్ పవార్, సుప్రియా సూలే ఆమోదం పొందిన తర్వాత ఫహద్ అహ్మద్ పార్టీ యూత్ జాతీయాధ్యక్షుడిగా నియమితులైనట్లు ఎన్సీపీ(ఎస్పీ) ఒక ప్రకటనలో తెలిపింది.
IMD: 1901 తర్వాత భారతదేశంలో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది. మొదటిసారిగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరి నమోదైంది. Read Also: Justice Bela Trivedi: ‘‘ఆమె జైలులోనే ఉండనివ్వండి, బరువు తగ్గుతుంది’’.. ఇది గోధుమ, శనిగ […]
Justice Bela Trivedi: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేలా ఎం త్రివేది ఒక కేసు విచారణ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితురాలిగా ఉన్న ఒక మహిళ బెయిల్ పిటిషన్‌ని ఫిబ్రవరి 27న ఆమె విచారిస్తున్న సందర్భంలో.. ‘‘ మహిళ బరువు తగ్గేందుకు ఆమెను కస్టడీలో ఉంచండి’’ అంటూ వ్యాఖ్యానించారు. నిందితురాలు అధిక బరువుతో బాధపడుతోందని, ఆమె తరుఫు న్యాయవాది కోర్టుకు చెప్పిన సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేవారు. ‘‘ఇది ఉపశమనం కోసం కారణం కావాలా..?’’ […]