UP Encounter: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు. పోలీస్ ఆపరేషన్‌లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. చనిపోయిన నిందితుడిని జీతుగా గుర్తించారు. ఇతడిపై రూ. 1 లక్ష రివార్డు ఉంది. బుధవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించాడు.
Annamalai: తమిళనాడులో ‘‘త్రి భాషా విధానం’’పై కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని బలవంతంగా ప్రయోగిస్తు్న్నారంటూ తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా, హిందీపై నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శలు గుప్పించారు.
Jharkhand: శివరాత్రి పర్వదినం రోజు జార్ఖండ్ హజారీబాగ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. హజారీబాగ్‌లోని డమ్రౌన్ గ్రామంలో శివరాత్రి డెకరేషన్‌పై ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చేయడంతో పాటు, పలు వాహనాలు, షాపులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
Amit Shah: పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. డీలిమిటేషన్‌పై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
Universal Pension Scheme: భారతీయులందరి కోసం కేంద్ర కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంఘటి రంగంలోని వారితో సహా అందరు పౌరులకు అందుబాటులో ఉండేలా ‘‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’’పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్మాణ కార్మికులు, గృహ సిబ్బంది, గిగ్ వర్కర్లు వంటి అసంఘటిత రంగంలోని వారికి ప్రభుత్వం నిర్వహించే పెద్ద పొదుపు పథకాలు అందుబాటులో లేవు.
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.
Jharkhand shocker: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికపై 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రానియా ప్రాంతంలో జరిగింది. ఒక వివాహం నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 18 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
CPM: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
Bombay High Court: ఏ తల్లీ తన సొంత బిడ్డను కొట్టదు అని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఏడేళ్ల కొడుకుపై దాడి చేసినందుకు తల్లితో సహా ఆమె భాగస్వామిపై కేసు నమోదై, అరెస్ట్ చేయబడ్డారు. అయితే, తాజాగా ఈ కేసులో బాలుడి తల్లి అయిన 28 ఏళ్ల మహిళకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Work-Week Debate: ఇటీవల కాలంలో ‘‘పని గంటల’’పై పలువురు కంపెనీల అధినేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీరి వ్యాఖ్యలపై ఇతర పారిశ్రామికవేత్తలు కూడా పెదవి విరిచారు. పని గంటల కన్నా ప్రొడక్టివిటీ ముఖ్యమని హితవు పలికారు. Read Also: V.Hanumantha Rao: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత.. తాజాగా, […]