Actor Darshan: కర్ణాటకలో రేణుకాస్వామి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అభిమానిని కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ తూగదీప, అతడి అనుచరులు దాడి చేసి హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్‌కి కర్ణాటక హైకోర్టు ఊరట కల్పించింది. దర్శన్ దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ఈ కేసుని ఏప్రిల్ 08కి వాయిదా వేసింది.
Sleep Crisis: భారతీయులు సరిగా ‘నిద్ర’’పోవడం లేదు. ‘‘నిద్ర సంక్షోభం’’ ముంచుకొస్తుందని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ, ఎలాంటి వైద్య సహాయం తీసుకోకపోవడం గమనార్హం. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు
Sambhal Jama Masjid: రంజాన్ పండగకు ముందు అలహాబాద్ హైకోర్టు సంభాల్ జామా మసీదు విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ శుక్రవారం ఉత్తర్వుల్లో ఆదేశించారు. అయితే, మసీదును తెల్లగా మార్చేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. రంజాన్ పండగ సందర్భంగా మసీదును తెల్లగా తుడిచి శుభ్రం చేయాలని అనుమతి కోరుతూ జామా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు […]
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘‘మహా కుంభమేళా’’ ముగిసింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా, దేశ విదేశాల నుంచి ‘త్రివేణి సంగమం’’కి భక్తులు పోటెత్తారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ హిందూ కార్యక్రమానికి ఏకంగా 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా […]
ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీప్ సీక్ చైనాలోని అన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చైనా ప్రజలు డీప్ సీక్‌ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లు, రోబో వ్యాక్యూమ్ క్లినర్లలో డీప్ సీక్‌ని ఉపయోగిస్తున్నారు. అనేక హోమ్ అప్లికేషన్స్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల్లో డీప్ సీక్ కృత్రిమ మేథను ఉపయోగిస్తామని ప్రకటించారు.
Rajasthan: రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా ఇప్పడు అట్టుడుకుతోంది. మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. జిల్లాలోని చిన్న పట్టణం మసుదాలో, పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దోపిడి, మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్రిక్తతల నడుమ మసుదాతో పాటు సమీప ప్రాంతాల్లో మార్కెట్లు మూసేశారు.
Israel: ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఓ వైపు కాల్పుల ఒప్పందం జరుగుతుంటే, మరోవైపు అనుమానిత ఉగ్రదాడులు ఇజ్రాయిల్‌ని కలవరపెడుతున్నాయి. గురువారం ఉత్తర ఇజ్రాయిల్‌లో పాదచారుల పైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీనిని పోలీసులు అనుమానిత ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు గాయపడ్డారు. Read Also: Mohammad Rizwan: జట్టు ప్రదర్శనపై ఎలాంటి సాకులు వెతకడం లేదు.. “ఇది ఉగ్రవాద దాడి అనే అనుమానం ఉంది. హైఫా నగరానికి దక్షిణంగా ఉన్న కర్కూర్ జంక్షన్ వద్ద […]
Israel Hamas: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తొలి దశ ముగింపుకు వస్తోంది. అయితే, ఈ దశలో చివరి షెడ్యూల్లో భాగంగా శనివారం ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. మొత్తం మీద ఈ దశలో 33 మంది ఇజ్రాయిలీలను హమాస్ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు థాయ్‌లాండ్ బందీలు కూడా ఉన్నారు.