NTRNeel : ప్రశాంత్ నీల్ సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ స్వల్పంగా జలుబుతో బాధపడుతున్నాడట. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా ఎన్టీఆర్ కాస్త అలసట గా ఉన్నాడని పూర్తి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అనుకోని కారణాల వలన ఇప్ప్పటికే వాయిదా పడిన ఈ సినిమా షూట్ మరోసారి బ్రేక్ పడింది. ఆయితే ఇది చిన్న బ్రేక్ మాత్రమే అని ఒకటి లేదా రెండు రోజుల్లో షూట్ తిరిగి స్టార్ట్ అవుతుందని యూనిట్ సమాచారం. ప్రశాంత్ నీల్ డ్రాగన్ ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి డ్రాగన్ ను మొదట 2026 జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ డిలే అవడంతో 2027 కు పోస్ట్ పోన్ అయింది. మరి సంక్రాంతి కానుకా తీసుకువస్తారా లేదా సమ్మర్ లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఎప్పుడు వచ్చిన సరే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం మాత్రం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
తాజావార్తలు
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!