Pune Rape Case: పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్‌స్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.
Donald Trump: రక్షణ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. రక్షణ ఖర్చల్ని తగ్గించుకోవాలని అమెరికా రష్యా, చైనాలకు ప్రతిపాదన చేసింది. ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా,రష్యాల మధ్య ట్రంప్ రావడంతో స్నేహం చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది.
China: భారత సరిహద్దుల్లో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. తాజాగా, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్సులో చైనా ఒక అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌కి భద్రతాపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది. భారత మిస్సైల్ ప్రోగ్రాం, జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేయబడిన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ (LPAR) 5,000 కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది. దీని ద్వారా చైనా హిందూ […]
UltraTech: దేశంలో అగ్రగామి సిమెంట్ కంపెనీల పేర్ల ఏంటంటే, మొదటగా గుర్తుకు వచ్చేది ‘అల్ట్రాటెక్’. సిమెంట్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే, ఇకపై అల్ట్రాటెక్ అంటే సిమెంట్ మాత్రమే కాదని నిరూపించేందుకు కంపెనీ సమాయత్తం అవుతోంది. కేబుల్స్ అండ్ వైర్స్ వ్యాపారంలోకి అల్ట్రాటెక్ అడుగుపెడుతోంది.
Shocking: పూణేలో దారుణం చోటు చేసుకుంది. రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో, పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో, నిలిచిన ఉన్న బస్సులో మంగళవారం 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు 8 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. స్నిఫర్ డాగ్స్‌ని రంగంలోకి దించారు. నిందితుడు 36 ఏళ్ల రాందాస్‌కి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు.
రైట్ వింగ్ న్యాయవాది షేర్ చేసిన పోస్ట్‌కి ప్రతిస్పందనగా, గాడ్సేని షైజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కమ్యూనిస్ట్ విభాగాలు, విద్యార్థి సంఘాలు DYFI, SFIలతో పాటు యూత్ కాంగ్రెస్ వంటి సంస్థలు ఈమెపై ఫిర్యాదు చేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో షైజాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.
BJP: తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య ‘‘త్రిభాషా విధానం’’, ‘‘హిందీ భాష’’పై వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ భాషను తమిళనాడుపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం ఎంకే స్టాలిన్, ఆయన డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. మున్సిపల్ పాఠశాలల్లో ‘‘విశ్వకర్మ పూజ’’కు సెలవును రద్దు చేసి, ఈ సెలువు దినాన్ని ‘‘రంజాన్’’ పండగకు కేటాయించడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈద్‌కి ఒకటికి బదులుగా రెండు రోజులు సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది.
Centre To Supreme: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిని రాజకీయ నాయకులపై జీవిత కాలం నిషేధం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న 6 ఏళ్లు సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని, దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో తన నిర్ణయాన్ని పేర్కొంది. ప్రజాప్రతినిధుల అనర్హత వ్యవధిని నిర్ణయించడం పూర్తిగా…