Pak Boat Seize: భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవను భారతీయ తీర రక్షక దళం (ICG) స్వాధీనం చేసుకుంది. భారత జలాల్లో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌తో సహా అందులో ఉన్న 11 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. తదుపరి విచారణ కోసం వీరిని గుజరాత్‌లోని జఖౌ మెరైన్ పోలీసులకు అప్పగించారు.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్..
బుధవారం భారత్ కోస్ట్ గార్డ్ ‘‘భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామికల్ జోన్ (EEZ)’’ లోపల 11 మంది సిబ్బందితో కూడిన పాకిస్తానీ ఫిషింగ్ బోట్‌ను పట్టుకున్నట్లు అని గుజరాత్ డిఫెన్స్ PRO వింగ్ కమాండర్ అభిషేక్ కుమార్ తివారీ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.