PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గుడు పడ్వా, ఉగాది పండగ సందర్భంగా ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన స్మృతి మందిర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపక నాయకులకు నివాళులు అర్పిస్తారని శనివారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్, సంస్థ రెండో సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు. 1956లో […]
Jallianwala Bagh: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నెత్తుటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ‘‘జలియన్ వాలాబాగ్’’ మారణహోమం. బ్రిటీష్ వాడి వలస చరిత్రపై సిగ్గుపడే గుర్తుగా మిగిలింది. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి 106 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇది యూకే పార్లమెంట్‌ని కుదిపేస్తోంది. ఇటీవల, బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ప్రభుత్వం ఈ దారుణంపై అధికారికంగా భారతదేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వలసవాద అణచివేతలో అత్యంత క్రూరమైన చర్యలలో శాశ్వత మచ్చగా మిగిలిందని ఆయన అన్నారు.
China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్‌ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్‌ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
USA: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్లపై విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాడు. ఇదిలా ఉంటే, వలసదారుల అణిచివేతలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో చర్యను తీసుకుంది.
Operation Brahma: భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కి ఇండియా ఆపన్నహస్తం అందిస్తోంది. శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అయితే, భూకంప బాధిత మయన్మార్‌కి సాయం చేసేందుకు భారత్ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. శనివారం ఆ దేశానికి 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారత వైమానిక దళం(ఐఎంఎఫ్) C130J సైనిక రవాణా విమానంలో హిండన్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్‌కి వెళ్లింది.
Black Magic: బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి, తంత్ర విద్యకు ఓ వ్యక్తి బలయ్యాడు. అత్యంత దారుణంగా అతడి తల నరికి, మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 65 ఏళ్ల యుగుల్ యాదవ్‌గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో తాంత్రికుడి బంధువు కూడా ఉన్నాడు.
US: డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై కన్నెర్ర చేస్తున్నారు. యూఎస్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారిని బహిష్కరించాడు. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్లోచదువుకుంటున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు యూస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(DOS) నుండి ఇమెయిల్‌లు రావడం సంచలనంగా మారింది. క్యాంపస్‌లో ‘‘యాక్టివిజం’’కి పాల్పడుతున్న విద్యార్థులకు F-1 వీసాలు (విద్యార్థి వీసాలు) రద్దు చేయబడ్డాయి. వీరంతా సెల్ఫ్-డిపోర్ట్ గురయ్యారని తెలుస్తోంది. ఈ అణిచివేత కేవలం క్యాంపస్‌లలో ఉద్యమాలు, నిరసనల్లో పాల్గొన్న […]
Scissors in stomach: 17 ఏళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళకు ఎక్స్-రే తీసి చూడటంతో షాక్‌కి గురయ్యారు. ఆమె కడుపుతో ఒక కత్తెర ఉండటాన్ని డాక్టర్లు గమనించారు. ఇన్ని ఏళ్లుగా ఈ విషయం ఎలా తెలియలేదని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మహిళ సిజేరియన్ సమయంలో కడుపులో కత్తెరను మరించిపోయినట్లు గుర్తించారు. లక్నోకి చెందిన బాధితురాలు సంధ్యా పాండేకు ఫిబ్రవరి 28, 2008లో ఒక బిడ్డ పుట్టింది. ఆ సమయంలో ‘‘షీ మెడికల్ కేర్’’ నర్సింగ్ హోమ్‌లో సీ-సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. ఆ సమయంలోనే…
Amit Shah: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వరస ఎన్కౌంటర్లతో నెత్తురోడుతోంది. వరసగా భద్రతా బలగాల దాడుల్లో మావోయిస్టులు మరణిస్తున్నారు. తాజాగా, శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో ఇది భద్రతా బలగాల విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాల నిల్వను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ‘‘క్రోనిజం’’, ‘‘నియంత్రణ దుర్వినియోగం’’ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందని అన్నారు. బిజెపి ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మానవ నష్టాన్ని కలిగిస్తుంది, దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీగల పని నిపుణులను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.