China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్‌ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్‌ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్‌లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
Read Also: USA: ఇండియన్స్‌కి షాక్.. “గ్రీన్ కార్డ్” ప్రాసెసింగ్‌ను నిలిపేసిన యూఎస్
గతంలో ఆఫీసు స్థలంలో ఉండమని ఓనర్ పర్మీషన్ ఇచ్చినప్పటికీ, దానికి తలుపులు సరిగా లేకపోవడంతో టాయిలెట్‌లో ఉండాలని నిర్ణయించుకుంది. అంతకుముందు, ఆమె తన యజమాని నివాసంలో ఉండేది. నెలకు £317 (రూ.34,570) సంపాదిస్తూ, వీటిలో కేవలం రూ. 4580 మాత్రమే ఖర్చు చేస్తూ, మిగతావి ఆదా చేస్తోంది. ఆమె తన ప్రతీ రోజు జీవితాన్ని డౌయిన్‌లో షేర్ చేస్తుంది. ఆమెకు 16,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
టాయిలెట్‌లో వంట దగ్గర నుంచి బట్టలు ఉతకడం, నిద్ర పోవడం వంటివి చేస్తుంది. రాత్రి సమయంలో దుర్వాసన రాకుండా మొత్తం క్లీన్ చేస్తుంది. ఉదయం పూట పనివేళల్లో ఉద్యోగులు టాయిలెట్ ఉపయోగించుకునేందుకు వీలుగా తన వస్తువుల్ని ప్యాక్ చేసుకుంటుంది. యాంగ్ తన జీవినశైలితో సంతృప్తి చెందింది. భవిష్యత్తులో ఇల్లు లేదా కారు కొనడానికి తగినంత డబ్బు ఆదా చేయాలని ఆశిస్తోంది.