Marriage Dates in 2026: హిందూ మతంలో 16 సంస్కారాలలో వివాహం అత్యంత ముఖ్యమైంది. జీవితంలో ఒకసారి జరిగే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని శుభంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు పంచాంగం, తిథి, నక్షత్రం, లగ్నం, శుభ సమయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే పెళ్లి తేదీని ఫిక్స్ చేసేటప్పుడు ముహూర్తాల ఎంపికకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే, 2026 సంవత్సరం పెళ్లిలకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా దేవశయని ఏకాదశికి ముందు, దేవుత్థాన ఏకాదశి తర్వాత అనేక శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి జోరుగా ఉండే అవకాశం ఉంది.
Read Also: Tharman : మరీ ఇంత అందంగా ఉన్నానేంట్రా.. తమన్ వీడియో వైరల్
అయితే, 2026లో నెలవారీగా పెళ్లి ముహూర్తాలు ఇవే..
ఫిబ్రవరి 2026: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26
మార్చి 2026: 1, 2, 3, 4, 7, 8, 9, 11, 12
ఏప్రిల్ 2026: 15, 20, 21, 25, 26, 27, 28, 29
మే 2026: 1, 3, 5, 6, 7, 8, 13, 14
జూన్ 2026: 21, 22, 23, 24, 25, 26, 27, 29
జులై 2026: 1, 6, 7, 11
ఇక, జులై మొదటి వారం వరకు పెళ్లిళ్ల సందడి ఎక్కువగా ఉంటుంది. దేవశయని ఏకాదశి తర్వాత చాతుర్మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలకు కొంత విరామం ఉంటుంది. అలాగే, చాతుర్మాసం ముగిసిన తర్వాత, దేవుత్థాన ఏకాదశి అనంతరం మళ్లీ పెళ్లి ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
Read Also: Dhandoraa : ఎన్టీఆర్ ట్వీట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘దండోరా’
నవంబర్ 2026 ముహూర్తాలు:
నవంబర్ 21 (శనివారం)
నవంబర్ 24 (మంగళవారం)
నవంబర్ 25 (బుధవారం)
నవంబర్ 26 (గురువారం)
నవంబర్ 27 (శుక్రవారం)
నవంబర్ 30 (సోమవారం)
డిసెంబర్ 2026 ముహూర్తాలు:
డిసెంబర్ 1, 2, 3, 4, 6, 9, 10, 11, 12, 13
ఈ తేదీలు వివాహాలకు చాలా శుభప్రదమైనవిగా పంచాంగం చెబుతోంది. పెళ్లి చేసుకునే వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండితులు లేదా జ్యోతిష్యులను సంప్రదించి లగ్నం, గోత్రం, జాతకాలు పరిశీలించి ఖచ్చితమైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం ఉత్తమం.