EAM Jaishankar: పాకిస్తాన్లో మైనారిటీల అణచివేతపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో మాట్లాడారు. పాకిస్తాన్ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరునను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని శుక్రవారం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో, పాకిస్తాన్లో మైనారిటీలపై నేరాలు, దౌర్జన్యాలపై సమాధానం ఇస్తూ.
Bajinder Singh: ‘‘యేషు యేషు పాస్టర్’’గా ప్రసిద్ధి చెందిన బజిందర్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా కోర్టు నిర్ధారించింది. స్వయం ప్రకటిత క్రైస్తవ పాస్టర్‌గా అందరికి తెలిసిన ఇతడిపై 2018లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో శుక్రవారం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఇతడికి శిక్ష పరిమాణాన్ని ఏప్రిల్ 1న ప్రకటించనుంది.
Gaza: ఇన్నాళ్లు యుద్ధంలో సర్వం కోల్పోయిన గాజా ప్రజలు తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ పరిస్థితికి ‘‘హమాస్’’ ఉగ్రవాదులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు గాజా ప్రజల కోసం ప్రజల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పుకుంటున్న హమాస్‌కి అక్కడి ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బుధవారం వరసగా రెండో రోజు, గాజా స్ట్రిప్‌లోని వందలాది మంది పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి హమాస్‌కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. Read Also: Disha Salian Case: […]
High Court: కస్టమర్ల ఫుడ్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలను చెల్లించడం వారి ఇష్టమని, రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా విధించలేవని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులపై సర్వీస్ ఛార్జీలను తప్పనిసరి చేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ, రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తన తీర్పులో.. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదని, వాటిని విధించవద్దని పేర్కొన్నారు.
Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసు మరోసారి సంచలనంగా మారింది. ఐదేళ్ల క్రితం, ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ భవనం 14వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయింది. సెలబ్రిటీ మేనేజర్ అయిన దిశా, దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి కూడా పనిచేసింది. దిశా మరణించిన ఆరు రోజులకు సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు మరణాలపై అనేక పుకార్లు వచ్చాయి.
Bird flu: భారతదేశంలో కోళ్ల ఫామ్స్, ఇంట్లో పెంచుకునే కోళ్లలో 8 ప్రాంతాల్లో వ్యాధికారక H5N1 బర్డ్ ఫ్లూ నమోదైనట్లు భారతీయ అధికారులను ఉటంకిస్తూ ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ శుక్రవారం తెలిపింది. సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలిచే ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వ్యాప్తిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతంలో గుర్తించినట్లు పారిస్‌కి చెందిన సంస్థ తన నివేదికలో తెలిపింది. దీని వల్ల 6,02,000 కోళ్లను చంపేసినట్లు చెప్పింది.
AIADMK-BJP: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు కూడా గంటల తరబడి చర్చించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-అన్నాడీఎంకేల పొత్తు తెర పైకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Viral Video: హర్యానా ఫరీదాబాద్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఇంట్లోని బెడ్రూంలోకి ఆవు, ఎద్దు దూరాయి. దీంతో భయపడిన మహిళ, ఇంట్లోని కప్‌బోర్డులో దాక్కుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన పశువులు బయటకు వెళ్లలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండు గంటల పాటు సాయం కోసం సదరు మహిళ కప్‌బోర్డులోనే ఉంది.
Bombay High Court: జీవిత భాగస్వామిని బెదిరించడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం విడాకులకు కారణమే అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని తన కుటుంబాన్ని బెదిరిస్తోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. జీవిత భాగస్వామిని బెదిరించడం అనేది క్రూరత్వం కిందకు వస్తుందని, విడాకులకు ఇవ్వడానికి కారణం అని హైకోర్టు చెప్పింది.
Dubai: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆయన భార్య షేఖా షైఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మక్తౌమ్ శనివారం వారి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఆడబిడ్డకు ‘‘హింద్’’గా నామకరణం చేశారు. షేక్ హమ్దాన్ తన తల్లి షేఖా హింద్ బింట్ మక్తౌమ్ బిన్ జుమా అల్ మక్తౌమ్ గౌరవార్థం నవజాత శిశువుకు 'హింద్' అని పేరు పెట్టారు.