USA: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్లపై విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాడు. ఇదిలా ఉంటే, వలసదారుల అణిచివేతలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో చర్యను తీసుకుంది. శరణార్థులతో సహా కొంత మంది వ్యక్తుల ‘‘గ్రీన్ కార్డ్’’ ప్రాసెసింగ్‌ని నిలిపేసింది. సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఆశ్రయం లేదా శరణార్థి హోదా పొందిన వలసదారులు దాఖలు చేసిన చట్టబద్ధమైన శాశ్వత నివాసం కోసం చేసిన అభ్యర్థనలను తాత్కాలికంగా నిలిపేసింది. ఈ చర్య వల్ల కొంత మంది భారతీయులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Delhi Capitals: కేఎల్ రాహుల్ పునరాగమనం ఖాయం.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జట్టులోకి
2023లో, 51,000 కంటే ఎక్కువ మంది భారతీయ పౌరులు యూఎస్‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం, USలో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య 2018లో 9,000 నుండి 2023లో 51,000కి పెరిగింది, ఇది ఐదు సంవత్సరాలలో 466% పెరుగుదలను సూచిస్తోంది. సొంత దేశంలో హింసకు భయపడి అమెరికా సరిహద్దుల్లో పట్టుబడిన ఇండియన్స్ శరణార్థి హోదా కోసం అప్లై చేసుకున్నాడు. భారతీయులు సహా ఇలాంటి శరణార్థులు అమెరికాలోకి ప్రవేశించి భద్రతా తనిఖీలు, వైద్యపరీక్షలు, ఇంటర్వ్యూల వంటి సుదీర్ఘ ప్రక్రియకు లోనవుతారు. తర్వాత, వీరికి అమెరికన్ అధికారులు శరణార్థి హోదాను మంజూరు చేస్తారు.
ఈ నేపథ్యంలో తాజాగా, పర్మినెంట్ రెసిడెంట్ దరఖాస్తులను కఠినంగా పరిశీలించేందుకు అమెరికా కొంత వరకు గ్రీన్ కార్డ్ ప్రక్రియను నిలిపేసింది. తన స్వదేశాల్లో హింసను ఆరోపిస్తూ యూఎస్ ఆశ్రయం పొందుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంది. యూఎస్‌లో ఉండాలనుకుంటున్న అనేక మంద భారతీయులు ఇలాంటి వాదనల్ని చేస్తున్నారు. ప్రస్తుతం, వీరందరికి షాక్ తగిలినట్లైంది. ఆశ్రయం కోరేవారికి గ్రీన్ కార్డ్ ప్రక్రియ నిలిపేయడం వల్ల కొంత మంది నిజమైన శరణార్థులు వేచి ఉండాల్సి వస్తోంది. యూఎస్ పౌరసత్వం పొందేందుకు తప్పుడు హింసను క్లెయిమ్ చేస్తున్నారో వారిపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ నిర్ణయం అనేక మంది భారతీయుల్ని కూడా ప్రభావితం చేయవచ్చు.