Amit Shah: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం వరస ఎన్‌కౌంటర్లతో నెత్తురోడుతోంది. వరసగా భద్రతా బలగాల దాడుల్లో మావోయిస్టులు మరణిస్తున్నారు. తాజాగా, శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో ఇది భద్రతా బలగాల విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాల నిల్వను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్.. దర్యాప్తులో పురోగతి
ఇది మావోయిజానికి మరో నిర్ణయాత్మక దెబ్బ అని అభివర్ణించిన అమిత్ షా, మార్చి 31, 2026 నాటికి మావోయిజాన్ని నిర్మూలిస్తామనే ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘నక్సలిజంపై మరో దాడి! సుక్మాలో జరిగిన ఆపరేషన్‌లో మా భద్రతా సంస్థలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టి, భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మేము నిశ్చయించుకున్నాము’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సాయుధ తిరుగబాటులో ఇప్పటికీ పాల్గొంటున్న వారికి అమిత్ షా కీలక విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు , హింస మార్పును తీసుకురాలేవని హితవు పలికారు. శాంతి, అభివృద్ధి మాత్రమే చేయగలవని అన్నారు. సుక్మా జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. జిల్లా రిజర్వ్ గార్డ్స్, సీఆర్‌పీఎఫ్ సంయుక్త దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మార్చి 22న అమిత్ షా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామని అన్నారు.