Scissors in stomach: 17 ఏళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళకు ఎక్స్-రే తీసి చూడటంతో షాక్‌కి గురయ్యారు. ఆమె కడుపుతో ఒక కత్తెర ఉండటాన్ని డాక్టర్లు గమనించారు. ఇన్ని ఏళ్లుగా ఈ విషయం ఎలా తెలియలేదని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మహిళ సిజేరియన్ సమయంలో కడుపులో కత్తెరను మరించిపోయినట్లు గుర్తించారు. లక్నోకి చెందిన బాధితురాలు సంధ్యా పాండేకు ఫిబ్రవరి 28, 2008లో ఒక బిడ్డ పుట్టింది. ఆ సమయంలో ‘‘షీ మెడికల్ కేర్’’ నర్సింగ్ హోమ్‌లో సీ-సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. ఆ సమయంలోనే కత్తెరను కడుపులో వదిలేసినట్లు గుర్తించారు.
Read Also: IPL: 9వ స్థానంలో ధోని బ్యాటింగ్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్.. సెటైర్స్ వేస్తున్న క్రికెటర్స్
అయితే, గత 17 ఏళ్లుగా సంధ్యా కడుపు నొప్పితో బాధపడుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ బాధను అనుభవిస్తూ వచ్చయింది. దీనిపై ఆమె భర్త అరవింద్ కుమార్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొన్నేళ్లుగా వైద్యులును సంప్రదిస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఇటీవల లక్నో మెడికల్ కాలేజీలో సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్స్ రే తీసి చూడగా ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు.
ఈ విషయం తెలిసిన తర్వాత, ఆమెకు లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో చేర్చారు. మార్చి 26న సంక్లిష్టమైన సర్జరీ చేసి కత్తెరనున బయటకు తీశారు. ఈ ఆపరేషన్ సవాలుతో కూడుకున్నదని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి బాగానే ఉందని, ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్లినట్లు చెప్పారు.