Operation Brahma: భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కి ఇండియా ఆపన్నహస్తం అందిస్తోంది. శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అయితే, భూకంప బాధిత మయన్మార్‌కి సాయం చేసేందుకు భారత్ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. శనివారం ఆ దేశానికి 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారత వైమానిక దళం(ఐఎంఎఫ్) C130J సైనిక రవాణా విమానంలో హిండన్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్‌కి వెళ్లింది.
‘‘మేము మయన్మార్ ప్రజలకు రిలీఫ్ మెటీరియర్, మానవతా సాయం అందించాము. భారత్ మొదటి ప్రతిస్పందనదారుగా ఉండటం మా విధానంలో భాగం’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ గురించి చెప్పింది. సహాయం కోసం పంపిన సామాగ్రిలో టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ లైట్స్, జనరేటర్ సెట్స్, అవసరమైన మెడిసిన్స్ ఉన్నాయి.
Read Also: BSNL Recharge: కేవలం రూ.1,198తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాదిపాటు నో టెన్షన్!
వీటితో పాటు సహాయం కోసం ఇప్పటికే రెండు ఇండియన్ నేవీ నౌకలు మయన్మార్ వెళ్లాయి. శనివారం తర్వాత ఒక ఫీల్డ్ ఆస్పత్రిని విమానంలో తరలించనున్నారు. ఆగ్రా నుంచి 118 మందితో కూడిన ఫీల్డ్ హాస్పిటల్ శనివారం తర్వాత బయలుదేరుతుందని భావిస్తున్నట్లు MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పొరుగుదేశానికి సాయం అందించడానికి కాంక్రీట్ కట్టర్లు, డ్రిల్ యంత్రాలు, సుత్తెలు, ప్లాస్మా కటింగ్ యంత్రాల వంటి భూకంప రెస్క్యూ పరికరాలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా మయన్మార్‌లో రెస్క్యూ కార్యక్రమాలు చేయనున్నారు. మరోవైపు, ఆ దేశంలో భారతీయ కమ్యూనిటీ కోసం నిరంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైన భారతీయ పౌరుల కోసం మా అత్యవసర నంబర్ +95-95419602 ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
A 118-member Indian Army Field Hospital unit is en route to Mandalay from Agra.
The team will assist in providing first aid and emergency medical services to the people of Myanmar.
🇮🇳 🇲🇲 pic.twitter.com/ULMp19KjEf
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 29, 2025