US: డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై కన్నెర్ర చేస్తున్నారు. యూఎస్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారిని బహిష్కరించాడు. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్‌లోచదువుకుంటున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు యూస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(DOS) నుండి ఇమెయిల్‌లు రావడం సంచలనంగా మారింది. క్యాంపస్‌లో ‘‘యాక్టివిజం’’కి పాల్పడుతున్న విద్యార్థులకు F-1 వీసాలు (విద్యార్థి వీసాలు) రద్దు చేయబడ్డాయి. వీరంతా సెల్ఫ్-డిపోర్ట్ గురయ్యారని తెలుస్తోంది. ఈ అణిచివేత కేవలం క్యాంపస్‌లలో ఉద్యమాలు, నిరసనల్లో పాల్గొన్న వ్యక్తులకు మాత్రమే కాకుండా, ‘‘జాతి వ్యతిరేక’’ పోస్టులు షేర్ చేసిన, లైక్ చేసిన వ్యక్తులకు కూడా ఈమెయిల్స్ వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేసిన కొంత మంది భారతీయ విద్యార్థులు కూడా ఇలాంటి ఈమెయిల్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. 2023-24లో యూఎస్‌లో చదువుకుంటున్న 1.1 మిలియన్ల అంతర్జాతీయ విద్యార్థుల్లో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అనేక అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కూ రుబియో ప్రకటించిన తర్వాత ఈ చర్య వచ్చింది. ప్రపంచంలోని ప్రతీ దేశానికి ఎవరు సందర్శకుడిగా రావాలో వద్దో నిర్ణయించే హక్కు ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం 300 వీసాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
హమాస్ లేదా ఇతర ఏ ఉగ్రవాద సంస్థకైనా మద్దతు ఇస్తున్నట్లు తేలిన విద్యార్థుల వీసాలను గుర్తించి రద్దు చేయడానికి రూబియో ఆఫీస్ ఇటీవల ‘‘క్యాచ్ అండ్ రివోక్’’ అనే AI-ఆధారిత యాప్‌ను కూడా ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా, DOS (ఇందులో కాన్సులేట్ అధికారులు కూడా ఉన్నారు) కొత్త విద్యార్థుల దరఖాస్తులను కూడా పరిశీలిస్తోంది. ఎవరైనా క్యాంపస్ యాక్టివిజానికి పాల్పడినా, ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపి దోషులుగా తేలితే, వారు యూఎస్‌లో చదువుకునేందుకు నిరాకరించబడుతున్నారు.
READ Also: Indigo Flight: ఫ్లైట్‌లో ప్రయాణికుడు మృతి.. అత్యవసర ల్యాండింగ్
ఇంతకీ ఈమెయిల్స్‌లో ఏముంది..?
అధికారుల నుంచి విద్యార్థులకు వచ్చిన ఈమెయిల్స్‌లో.. డొనాల్డ్ ట్రంప్ మార్చి 10న ప్రారంభించిన CBP హోమ్ యాప్‌ను ఉపయోగించి తమను తాము స్వీయ-డిపోర్ట్ చేసుకోవాలని కోరారు. యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(i) ప్రకారం వీసా రద్దు చేయబడినట్లు పేర్కొంది.
బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా ఆఫీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యొక్క ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అప్రమత్తం చేసిందని, వారు మీ F-1 వీసా రద్దు గురించి మీ యూనివర్సిటీ అధికారికి తెలియజేయవచ్చు అని ఈమెయిల్ పేర్కొంది. చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ లేకుండా యూఎస్‌లో ఉంటే జరిమానాలు, నిర్బంధం లేదా బహిష్కరణకు దారి తీయవచ్చని హెచ్చరించింది. ఇది భవిష్యత్తులో యూఎస్ వీసాలకు మిమ్మల్ని అనర్హుల్ని చేస్తుందని చెప్పింది. బహిష్కరించిన వ్యక్తులు వారి స్వదేశానికి పంపవచ్చు అని చెప్పింది.
బహిష్కరించబడిన విద్యార్థులు భవిష్యత్తులో అమెరికాకు తిరిగి రావాలనుకుంటే, వారు కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈమెయిల్ పేర్కొంది. మీరు యునైటెడ్ స్టేట్స్ నుండి బయలుదేరిన వెంటనే, మీ వీసాను భౌతికంగా రద్దు చేయడానికి మీ వీసా జారీ చేసిన US రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌కు మీరు వ్యక్తిగతంగా మీ పాస్‌పోర్ట్‌ను సమర్పించాలి. మీ వీసా రద్దు చేయబడినందున మీరు దానిని ఉపయోగించడానికి ప్రయత్నించకూడదు. మీరు భవిష్యత్తులో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లాలనుకుంటే, మీరు మరొక US వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి ఈమెయిల్లో చెప్పారు.