Myanmar Earthquake: భారీ భూకంపంతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 1000ని దాటింది. భవనాల శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్‌ని భూకంపం వణించింది. 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. భూకంప లోతు 10 కి.మీగా ఉంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Goa: పర్యాటకానికి కేరాఫ్‌గా ఉన్న గోవాలో ఇటీవల కాలంలో ఆదాయం పడిపోతోంది. టూరిస్టులు గోవాకు రావాలంటే భయపడిపోతున్నారు. టాక్సీల దగ్గర నుంచి ప్రతీ విషయంలో దోపిడీకి గురవుతున్నామనే బాధ టూరిస్టుల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే గోవాలకు అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గుతున్నట్లు డేటా సూచిస్తోంది.
April 1: ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రారంభం వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పన్ను స్లాబులు, రేట్లు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను స్లాబులు, […]
Suitcase murder: బెంగళూర్‌లో భార్యను హత్య చేసి, సూట్‌కేసులో దాచిన సంఘటన సంచలనంగా మారింది. తన భార్య గౌరీ(35)ని హత్య చేసినట్లు భర్త రాకేష్ ఖేడేకర్(36) తన తండ్రి రాజేంద్రకు ఫోన్ కాల్ చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. రాజేంద్ర చెబుతున్న వివరాల ప్రకారం.. రాకేష్ తనకు ఫోన్ చేసి, గౌరీతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేవాడు, అందువల్లే నేను చంపేశాడని అన్నాడు. ఆమె వేధింపుల గురించి గతంలో తన అత్తగారికి కూడా చెప్పాడు. గౌరీ మామ అయిన…
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
L2: Empuraan: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘ఎల్2:ఎంపురాన్’ వివాదానికి తెరతీసింది. కేరళలో అధికార కమ్యూనిస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాని స్వాగతించాయి. అయితే, అదే సమయంలో ‘‘సంఘ్ ఎజెండా’’ని సినిమా బహిర్గతం చేసిందని ఆ పార్టీలు, బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాయి. లూసిఫర్ సినిమా సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో పరోక్షంగా 2002 గుజరాత్ అల్లర్లను సూచిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఈ సినిమా చర్చించింది.
Char Dham Yatra 2025: యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌ల ‘‘చార్ ధామ్’’ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్‌కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్‌కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి.
Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో కూడా శక్తివంతమైన భూకంపాల కారణంగా మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్ వణికాయి. సాగింగ్ పట్టణానికి వాయువ్యంగా 16 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది.
Wife Poisons Husband: భార్య దురాగతానికి మరో భర్త బలయ్యాడు. వేరే వ్యక్తితో మాట్లాడ వద్దని చెప్పడమే అతడికి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఏకంగా భర్త తాగే కాఫీలో విషం కలిపి అతడిని హతమార్చాలని ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లోని భగేలా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అనుజ్ శర్మ మీరట్‌లో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పింకీ అలియాస్ సనాతో ఈ విషయమై తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదం గతంలో పోలీస్ స్టేషన్ జోక్యానికి…
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో 53 శాతం నుంచి 55 శాతానికి డీఏ పెరగనుంది. ఈ పెంపు జనవరి1, 2025 నుంచి వర్తిస్తుంది. మొత్తంగా ఉద్యోగులు జీతాలు పెరకబోతున్నాయి. చివరిసారిగా కేంద్రం జూలై 2024లో డీఏని పెంచింది. ఆ సమయంలో 50 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది.