Supreme Court: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్‌ని ఈ రోజు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ని విచారించేందుకు నో చెప్పింది. ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిన్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్..
సోషల్ మీడియా పిల్లల మనస్సులపై చూసే తీవ్రమైన శారీరక, మానసిన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పిటిషన్ ప్రస్తావించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్స్ పిల్లలకు యాక్సెస్ నియంత్రించేందుకు బయోమెట్రిక్ ప్రామాణీకరణ, వయసు ధ్రువీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్ కోరింది. ‘‘ఇది విధానపరమైన విషయమని, మీరు పార్లమెంట్ చట్టం రూపొందించాలని అడగాలి’’ అని సుప్రీంకోర్టు పిటిషనర్ న్యాయవాదికి తెలిపింది. సంబంధిత అథారిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చే స్వేచ్ఛ ఇస్తూనే, పిటిషనర్ రిప్రజెంటేషన్ ఇస్తే, అది 8 వారాల్లో పరిగణించబడుతుందని అని కోర్టు తెలిపింది.
జెప్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్, 13 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు తప్పనిసరి తల్లిదండ్రుల నియంత్రణల నిబంధనలను, రియల్-టైమ్ పర్యవేక్షణ సాధనాలు, కఠినమైన వయస్సు ధృవీకరణ, కంటెంట్ పరిమితులను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్‌లో చేర్చాలని కేంద్రం, ఇతరులకు ఆదేశాలు కోరింది. సోషల్ మీడియా అతి వినియోగంపై మైనర్లు తీవ్రమైన మానసిక క్షోభ, సామాజిక ఒంటరితనం, వ్యవసం లాంటి తీవ్రమైన పరిస్థితులతో బాధపడుతున్నారని, పరిశోధనలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషన్ పేర్కొంది. దేశ జనాభాలో దాదాపు 30 శాతం మంది నాలుగు నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.