PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహ్మద్ యూనస్, భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. థాయ్‌లాండ్ బ్యాంకాక్‌లో 6వ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నాయకులు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సంబంధం అవసరారన్ని ప్రధాని మోడీ యూనస్‌కి తెలియజేశారు. అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో చెప్పారు.
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి యూనస్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోడీ నుంచి యూనస్‌కి హెచ్చరిక లాంటి సూచన రావడం గమనార్హం. ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలోకి మీ ప్రభావాన్ని విస్తరించాలని చైనాను యూనస్ కోరుతున్న వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. యూనస్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: bird Flu: ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం.. రంగంలోకి కేంద్రం..
తాజాగా, మోడీ-యూనస్ భేటీలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరిగాయి. ఈ దాడుల పట్ల భారత్ తన అభ్యంతరాన్ని బంగ్లాదేశ్‌కి తెలిపింది. దాడులను అడ్డుకోవాలని సూచించింది.
ఈ భేటీలో ‘‘”ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌తో సానుకూల మరియు నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే భారతదేశం యొక్క కోరికను ప్రొఫెసర్ యూనస్ నొక్కిచెప్పారు” అని మిస్రి అన్నారు. సరిహద్దు భద్రతపై ఇద్దరు నేతలు చర్చించారు. అక్రమ చొరబాటులను నిరోధించడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రధాని మోడీ చెప్పారు. బంగ్లాదేశ్ లోని హిందువులు సహా మైనారిటీల భద్రతపై ప్రధాని తన ఆందోళన వ్యక్తం చేసినట్లు మిస్రీ వెల్లడించారు.