Karnataka: కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. సొంత కమ్యూనిటీకి చెందిన సభ్యులే దొంగతం ఆరోపణలో ఓ బాలుడిని చిత్రహింసలు పెట్టారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. బాధితుడిని చన్నగిరి తాలూకా నల్లూర్ సమీపంలోని అస్తపనహళ్లీ గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిగా గుర్తించారు.
Read Also: Petrol price hike: సామాన్యుడికి షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
దొంగతనం ఆరోపణపై బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అతడి ప్రైవేట్ భాగాలపై ఎర్ర చీమలను వదిలి చిత్రహింసలు పెట్టారు. హింసించిన నిందితులు కూడా అదే గిరిజన సమూహానికి చెందిన వారు. బాలుడిపై దొంగతనం ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ శిక్షను విధించారు. కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్థానిక అధికారులు స్పందించారు. చన్నగిరి పోలీసులు గ్రామాన్ని సందర్శించి, పూర్తి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆమె ధ్రువీకరించారు.