Prasanna Sankar-Dhivya: టెక్ బిలయనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ దంపతులు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రసన్న శంకర్, అతడి భార్య దివ్యా శశిథర్ కిడ్నా్ప్, లైంగిక వేధింపులు ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రసన్న శంకర్ విడాకులు, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. తన భార్య దివ్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రసన్న, దివ్యపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు, వాట్సాప్ చాటింగ్ కూడా ఉన్నాయని ప్రసన్న సంచలన ఆరోపణలు చేశారు. అనూప్ అనే వ్యక్తితో తన భార్య ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపించాడు.
ఇదెలా ఉంటే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దివ్య, ప్రసన్నపై సంచలన ఆరోపణలు చేసింది. దివ్య ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్ కు వ్యక్తిగత ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త తనను సెక్స్ కోసం ఎలా బలవంతం చేశాడనే విషయాన్ని చెప్పింది. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. బాత్‌రూంలో కెమెరాలతో ఎలా నిఘా పెట్టాడనే విషయాన్ని, రోజూవారీ కార్యకలాపాల సమయంలో ఎలా చిత్రీకరించాడనే విషయాన్ని వెల్లడించింది.
READ ALSO: Gas Cylinder Price Hike: వంటింట్లో మంట.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
తన సంపదపై పన్నులు పడొద్దని తనను, తన కొడుకును దేశం మరో దేశానికి ఈడ్చుకెళ్లినట్లు వెల్లడించింది. తాను ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా తనతో బలవంతంగా సెక్స్ చేశాడని దివ్య చెప్పింది. తన కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని, సెక్స్ నాకు ప్రాథమిక అవసరమని చెప్పాడని తెలిపింది. ఒక వేళ నాతో నువ్వు శృంగారంలో పాల్గొనకుంటే, నేను బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడని వెల్లడించింది.
ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. కోర్టుకు దివ్య ఇచ్చిన వాంగ్మూలంలో, తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఉద్యోగం మానేయాలని బలవంతం చేసేవాడని, లేకుంటే ఇతర భాగస్వాములను చూసుకుంటా అని బెదిరించేవాడని ఆరోపించింది. అంతే కాకుండా తన స్నేహితులతో పడుకోవాలని ఒత్తిడి చేసేవాడని దివ్య కోర్టుకు తెలిపింది. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే అని, అతడితో తన సంబంధం లైంగికమైనది కాదని, భావోద్వేగమైనదని ఆమె న్యాయవాదులు కోర్టులో తెలిపారు.
ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. 2017లో ప్రసన్న శంకర్ తన స్టార్టప్ రిప్లింగ్‌ని స్థాపించాడు. 2022 నాటికి శంకర్ బిలియనీర్ హోదాను ఫోర్బ్స్ గుర్తించింది. ప్రస్తుతం రిప్లింగ్ వాటాలో 9 శాతం కలిగి ఉన్నాడు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాడ్ చేసింది.