Kedar Jadhav: భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన జాదవ్, ఇప్పుడు రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల కేదార్ జాదవ్ మంగళవారం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో అధికారికంగా చేరారు. మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే ఆయనను పార్టీలోకి స్వాగతించారు.
Love Jihad: ‘‘లవ్ జిహాద్’’ ఆరోపణల నేపథ్యంలో పూణేలోని కోత్రుడ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. ఒక సెలూన్‌ని ధ్వంసం చేశారు. ఒక హిందూ అమ్మాయిని, సెలూన్లో పనిచేస్తున్న ఉద్యోగి బలవంతంగా ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. సోమవారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rajasthan: రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాను పార్టీ నుండి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల అల్వార్‌లోని ఒక ఆలయాన్ని కాంగ్రెస్‌కి చెందిన దళిత ఎమ్మెల్యే సందర్శించారు. దీని తర్వాత, అహుజా గంగా జలంలో ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత టికారం జుల్లీ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత అహుజా ఈ చర్యకు పాల్పడ్డాడు. దళిత ఓటర్లు కీలక పాత్ర పోషించే తూర్పు రాజస్థాన్‌లో […]
Pakistan: ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి స్వర్గధామం అయిన పాకిస్తాన్లో ఇప్పుడు వారికి రక్షణ కరువైంది. ముఖ్యంగా భారత వ్యతిరేక టెర్రరిస్టులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి చేరడం లేదు. ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ లేదా ‘‘గుర్తు తెలియని వ్యక్తుల’’ దాడుల్లో వరసగా మరణిస్తున్నారు. సింపుల్‌గా బైక్‌పై వచ్చే వీరి, ఉగ్రవాదిని దగ్గర నుంచి కాల్చివేసి, వేగంగా అక్కడి నుంచి పారిపోతున్నారు. అసలు వీరు ఎవరనే విషయం ఇప్పటికీ పాక్ ప్రభుత్వానికి, దాని గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి అస్పష్టంగా ఉంది.
Uttar Pradesh: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వ్యూస్, ఫాలోవర్లను రాబట్టుకోవాలని కంటెంట్ క్రియేటర్లు చూస్తు్న్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ కు చెందిన ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకుని, ప్రయాణిస్తున్న ట్రైన్‌ని షూట్ చేశాడు. వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
JPMorgan CEO: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించడం సొంత దేశంలోని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇటీవల ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసనలు జరిగాయి. యూఎస్ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మరోవైపు, ట్రంప్ టారిఫ్స్ అమలులోకి వచ్చే ముందే, తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు.
Shiv Sena MP: శివసేన ఎంపీ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని పొగుడుతూ ఆయన ‘‘ప్రజల సీఎం’’ అని అన్నారు. ఏక్ నాథ్ షిండే రికార్డుల్లో ఉపముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ప్రజల ముఖ్యమంత్రి అని శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే శనివారం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ చేపట్టిని కొన్ని నెలల తర్వాత ఎంపీ నుంచి…
Congress: అహ్మదాబాద్ వేదికగా రేపు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరగబోతోంది. పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరుగుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ప్రియాంకా గాంధీపై నెలకొంది. ఆమెకు కీలక పాత్ర అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో సంస్థాగత వికేంద్రీకరణ, కూటమి నిర్వహణ, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వస్తున్న వేళ ప్రియాంకా గాంధీని ఎలా ఉపయోగించుకోవాలనే నిర్ణయాన్ని…
Chiken Biryani: నోయిడాకు చెందిన ఓ మహిళకు రెస్టారెంట్ వెజ్ బిర్యానీకి బదులుగా చికెన్ బిర్యానీని అందించింది. పూర్తిగా శాఖాహారి అయిన మహిళ ఏడుస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాయా శర్మ అనే మహిళ స్విగ్గీ ద్వారా రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే, నవరాత్రి సందర్భంగా నాన్-వెజ్ బిర్యానీ వచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా రెస్టారెంట్ చేసిందని ఆరోపించింది. Read Also: Vijay-Rashmika : మళ్లీ దొరికేసిన విజయ్, రష్మిక.. […]
Theft: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి, దొంగతనం చేసిన క్షమించాలని కోరుతూ లేఖ రాశాడు. ఖార్గోన్ జిల్లాలో ఒక దుకాణం నుంచి రూ. 2.45 లక్షలు దొంగలించిన వ్యక్తి, ‘‘రామ నవమి’’ రోజు దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరాడు. అప్పులతో ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో దొంగిలిచిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చాడని సోమవారం పోలీస్ అధికారులు చెప్పారు.