Tahawwur Rana: 26/11 నిందితుడు, ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. అమెరికా అత్యున్నత న్యాయస్థానాలు ఇండియాకు అప్పగించేందుకు అనుమతించడంతో, ఇతడిని భారత్ తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాడు. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది కావడంతో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలెం ఎయిర్ పోర్టు నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది.
TMC: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, కీర్తి ఆజార్ మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బీజేపీ నేత అమిత్ మాల్వియా వీరి మధ్య గొడవల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పరిస్థితి విషమించడంతో తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Waqf protest: వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనల పేరుతో అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడుతున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్ష నెలకొంది. ఈ ప్రాంతంలో కీలకమైన రహదారిని అడ్డుకోకుండా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Smartphone: భారత్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఈ ఎగుమతుల్లో దాదాపుగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ‘‘ఐఫోన్’’ షిప్మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో చూస్తే స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 54 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్రమంత్రి అన్నారు. గత 10 ఏళ్లలో భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ […]
Waqf Act: ఈ రోజు నుంచి వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. గత వారం పార్లమెంట్ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
UP: ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలో ‘‘మీరట్’’ తరహా మర్డర్ సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యనే భర్తను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిజ్నోర్ నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. రైల్వే టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్‌ని అతడి భార్య శివాని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త గుండెపోటుతో మరణించినట్లు ముందుగా శివాని చెప్పింది. Read Also: Punjab: బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి.. పాకిస్తానీతో సహా […]
Punjab: పంజాబ్ జలంధర్‌లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా నివాసం వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కేసును 12 గంటల్లో ఛేదించామని పోలీసులు వెల్లడించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ‘‘పెద్ద కుట్ర’’ జరిగిందని పంజాబ్ పోలీసులు తెలిపారు.
Congress: అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. ఆరు దశాబ్ధాల తర్వతా గుజరాత్లో ఏఐసీసీ అత్యున్న సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది.
UP: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహాలో 26 ఏళ్ల షబ్నమ్ అనే మహిళ, ఇంటర్ విద్యార్థితో సంబంధం పెట్టుకుని, అతడిని పెళ్లి చేసుకుంది. తన రెండో భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి అతడిని వివాహమాడింది. దీనిపై స్థానికంగా చాలా విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, మతాల నేపథ్యం, షబ్నమ్ పిల్లల్ని, భర్తని విడిచిపెట్టాలనే నిర్ణయం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.