Petrol price hike: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటర్‌కి రూ. 2 పెంచినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ తెలిపింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ పెంపు ఏప్రిల్ 8, 2025 నుండి, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ పెంపు వల్ల పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 13కి, డీజిల్‌పై రూ. 10కి పెంచినట్లు ఉత్తర్వులో పేర్కొంది.
Read Also: Mahesh Kumar Goud: కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలలు కనడం మానండి..
అమెరికా పరస్పర సుంకాల వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాల నేపథ్యంలో, ప్రపంచ ముడి చమురు ధరలు వాస్తవానికి తగ్గుతున్న సమయంలో ఈ పెంపు నిర్ణయం వచ్చింది. అయితే, ఈ పెంపు వల్ల సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని చెప్పింది. ప్రజలపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని ఉపయోగించుకుంటోందని అన్నారు. మే 2014 నుంచి ముడి చమురు ధరలు 41 శాతం తగ్గాయి. అయినప్పటికీ ప్రభుత్వం వినియోగదారులకు ప్రయోజనాలను అందించడం లేదని ఖర్గే ఎత్తిచూపారు.