Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.
UP: తన భార్య, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన ఓ భర్త, ఇకపై తాను ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసే అవకాశం ఉందని, మీరట్‌లో జరిగినట్లు డమ్ముల్లో ముక్కలు అవ్వడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని మౌరానిపూర్లో జరిగింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో గుమస్తాగా పనిచేస్తున్న రీతు వర్మ అనే మహిళ స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్‌తో సంబంధం కలిగి ఉందని ఆమె భర్త…
Bangladesh: బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం ద్వారా ఆ ప్రాంతానికి విస్తరించవచ్చని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ సీరియస్‌గా తీసుకుంటోంది. చైనా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో, పరోక్షంగా భారత్‌ని దెబ్బతీసే ప్రయత్నంలో బంగ్లాదేశ్ ఉందని భారత అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు.
Waqf law: ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ చట్టానికి కోటి మంది వ్యతిరేకంగా చేసిన సంతకాల చేసిన తీర్మానాన్ని ప్రధాని నరేంద్రమోడీ పంపుతామని చెప్పారు. కోల్‌కతా రాంలీలా మైదానంలో జరిగిన భారీ సమావేశంలో జమియిత్ బెంగాల్ చీఫ్, రాష్ట్ర మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి చట్టాన్ని రద్దు చేయాలని ప్రధాని మోడీని కోరారు.
Nitish Kumar: బీహార్‌కి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ని ‘‘ఉప ప్రధానమంత్రి’’ అని అన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఎన్డీయేకు నితీష్ కుమార్ చాలా కృషి చేశారని అన్నారు. బీహార్ ఎన్నికల ముందు బీజేపీ నాయకుడు చేసిన ప్రకటన అందర్ని ఆశ్చర్యపరిచింది.
Allahabad HC: పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాధితురాలి తీరును తప్పుపడుతూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు ‘‘తానే ఇబ్బందుల్ని ఆహ్వానించింది’’, ‘‘ ఈ సంఘటనకు ఆమె బాధ్యత వహిస్తుంది’’అని పేర్కొంది. ఢిల్లీలో మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో డిసెంబర్ 2024లో అరెస్ట్ అయిన నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మంది మరణానికి కారణమైన పాక్-కెనెడియన్ ఉగ్రవాది తహవూర్ రాణాని భారత్‌కి తీసుకువచ్చారు. అమెరికా అతడిని ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం భారతీయ అధికారులు, రాణాని ఢిల్లీకి చేర్చారు. ఇతడిని ప్రశ్నించేందుకు ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.
Tahawwur Rana: మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్‌కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు.
Apple: డొనాల్డ్ ట్రంప్ ‘‘టారిఫ్’’ల పుణ్యామా అని, వీటిని తప్పించుకునేందుకు ప్రపంచ దేశాలు ఎగుమతుల్ని పెంచింది. టారిఫ్స్ అమలులోకి రాకముందే పలు దేశాలు అమెరికాకు ఎగుమతుల్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ట్రంప్ ఎఫెక్ట్‌తో ఐఫోన్ ఎగుమతుల్ని పెంచింది. ఏకంగా 600 టన్నుల ఐఫోన్లను విమానంలో అమెరికాకు తరలించింది. ట్రంప్ టారిఫ్‌లు అమలులోకి వస్తే ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున యూఎస్‌కి వీటిని తరలించింది.
Tahawwur Rana: 26/11 ముంబై దాడుల ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ తహవూర్ రాణాను అమెరికా, భారత్‌కి అప్పగించింది. గురువారం భారత అధికారులు రాణాను ఇండియాకు తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత, భద్రతా అధికారులు విస్తృత భద్రతను ఏర్పాటు చేశారు. భారత్ రాకుండా అనేక పర్యాయాలు అమెరికా కోర్టుల్ని ఆశ్రయించిన రాణాను, భారత్ తీసుకురావడానికి అధికారులు చేసిన కృషి ఫలించింది. ఇదిలా ఉంటే, రాణా అప్పగింతపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ టార్గెట్‌గా […]