UP: శివానీగా మారిన షబ్నమ్.. భర్త, ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి ఇంటర్ విద్యార్థితో పెళ్లి..
- రెండో భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి ఇంటర్ విద్యార్థితో పెళ్లి..
- పెళ్లి కోసం షబ్నమ్ పేరును శివానీగా మార్చుకున్న మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహాలో 26 ఏళ్ల షబ్నమ్ అనే మహిళ, ఇంటర్ విద్యార్థితో సంబంధం పెట్టుకుని, అతడిని పెళ్లి చేసుకుంది. తన రెండో భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి అతడిని వివాహమాడింది. దీనిపై స్థానికంగా చాలా విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, మతాల నేపథ్యం, షబ్నమ్ పిల్లల్ని, భర్తని విడిచిపెట్టాలనే నిర్ణయం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శివ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువకుడిని పెళ్లి చేసుకునేందుకు షబ్నమ్ తన పేరుని శివానీగా మార్చుకుంది. తాము ఇద్దరం తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, ఇద్దర సంతోషంగా ఉన్నామని, తమిద్దరం మేజర్లమని, మా జీవితాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని షబ్నమ్ కోరింది.
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
నివేదిక ప్రకారం.. షబ్నమ్, శివకు సంబంధం ఉంది. ఇది రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో కమ్యూనిటీ పంచాయతీ ఈ కేసులో జోక్యం చేసుకుంది. చర్చించిన తర్వాత షబ్నమ్ తనకు నచ్చిన చోట ఉండవచ్చనే పంచాయతీ తీర్పు చెప్పింది. షబ్నమ్‌కి ఇది మూడో వివాహం.
8 ఏళ్ల క్రితం అలీఘర్‌కి చెందిన సాయిద్ నాగ్లితో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. అయితే, ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడికి గాయాలై, వికలాంగుడు అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, అదే ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడికి షబ్నమ్ దగ్గరైంది. చివరకు ఈ జంట ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈమె పిల్లలు మాజీ భర్తతో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!