Punjab: పంజాబ్ జలంధర్‌లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా నివాసం వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కేసును 12 గంటల్లో ఛేదించామని పోలీసులు వెల్లడించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ‘‘పెద్ద కుట్ర’’ జరిగిందని పంజాబ్ పోలీసులు తెలిపారు.
మీడియా సమావేశంలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అర్పిత్ శుక్లా మాట్లాడుతూ.. జీషన్ అక్తర్, పాకిస్తాన్‌కి చెందిన షాజెద్ భట్టీ ఈ దాడిలో కీలక కుట్రదాలుని చెప్పారు. నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) తో వీరికి ఉన్న సంబంధాలు ఉన్నాయా..? అని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
READ ALSO: Rashmi Gautam : లెహంగాలో మెరిసిపోతున్న రష్మీ.. ఆ అందాలు చూస్తే..
మంగళవారం తెల్లవారుజామున 1గంట ప్రాంతంలో కాలియా ఇంటి వెలుపల గ్రానేడ్ దాడి జరిగింది. ఆ సమయంలో మాజీ మంత్రి అయిన కాలియా ఇంట్లోనే ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి ఈ-రిక్షాలో వచ్చి, గ్రానేడ్ విసిరి పారిపోతున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దాడిలో ఉపయోగించిన ఆటోరిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన మనోరంజన్ కాలి, గ్రెనేడ్ శబ్ధాన్ని మొదట ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు, ఉరుము శబ్ధంగా భావించానని, ఆ తర్వాత ఇది గ్రెనేడ్ దాడిగా తేలిందని చెప్పారు.
గత ఆరు నెలల్లో పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడుల్లో ఇది తాజాది. 2024 అక్టోబర్ మధ్య నుండి, రాష్ట్రం కనీసం 16 నమోదయ్యాయి. పోలీస్ పోస్టులు, నివాస ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలను, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. వీటిలో అమృత్‌సర్, నవాన్‌షహర్, బటాలా, గురుదాస్‌పూర్, పాటియాలాలోని పోలీసు పోస్టులపై దాడులతో పాటు, అమృత్‌సర్‌లోని ఖాండ్వాలాలో ఒక ఆలయంపై దాడి జరిగింది.
This is how a grenade attack was carried out at the residence of BJP leader and former Punjab minister Manoranjan Kalia in Jalandhar.
Punjab, under the Arvind Kejriwal-led AAP, is facing a serious crisis—law and order has completely collapsed. It began with the assassination of… pic.twitter.com/roB2ra7ftZ— Amit Malviya (@amitmalviya) April 8, 2025