Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఒక మహిళ తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయింది. ఈ సంఘటన యావత్ దేశంలో వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటి మరో సంఘటన యూపీలోని బాదౌన్‌లో జరిగింది. ఒక మహిళ తన కుమార్తె మామగారితో పారిపోయింది. మమత అనే మహిళ, తన కూతురి మమా శైలేంద్ర అలియాస్ బిల్లుతో లేచిపోవడం సంచలనంగా మారింది.
Shocking: పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో భర్తలు, కాబోయే భర్తల్ని చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హర్యానా ఫరీదాబాద్‌కి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన పెళ్లికి రెండు రోజుల ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాబోయే భర్తపై, మహిళ ప్రియుడు, ఇతరులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తన వర్కర్లపై కర్కషంగా ప్రవర్తించాడు. ఇద్దరు కార్మికులను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశాడు. దొంగతనం చేశారనే అనుమానంతో వారిద్దరికి కరెంట్ షాక్‌లు ఇస్తూ, గోళ్లు ఊడపీకి హింసించాడని శనివారం పోలీసులు తెలిపారు. రాజస్థాన్ భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి అనే ఇద్దరు బాధితులను ఒక కాంట్రాక్టర్ ద్వారా కోర్బా జిల్లాలోని గుర్జార్ యాజమాన్యంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నియమించుకున్నారు.
India Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ నాయకుడు భబేష్ చంద్ర రాయ్‌ని కిడ్నాప్ చేసి, హత్య చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులతో సహా అన్ని మైనారిటీలను రక్షించే బాధ్యతను నిర్వర్తించాలని భారత్ పిలుపునిచ్చింది.
Elon Musk: ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇరువురు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
UP: ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్లో శనివారం బుర్ఖా ధరించిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒక హిందూ అబ్బాయితో బైక్‌పై ప్రయాణిస్తున్న ముస్లిం అమ్మాయిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు బాధితులు కూడా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. లోన్
Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా దాడుల వల్ల కలిగిన విధ్వంసాన్ని చూడాలని కోరారు. ‘‘దయచేసి, ఏ విధమైన నిర్ణయాలు, ఏ రకమైన చర్చలు జరపడానికి ముందు, ఉక్రెయిన్‌లో ప్రజలు, ఆస్పత్రులు, చర్చిలు, పిల్లలు ఎలా నాశనం చేయబడ్డారో, చనిపోయారో చూడటానికి రండి’’ అని ఆదివారం జెలెన్స్కీ, ట్రంప్‌ని కోరారు.
Tata Curvv Dark Edition: దేశీయ ఆటోమేకర్ టాటా, తన కూపే SUV అయిన కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే, టాటాలో నెక్సాన్, హారియర్, సఫారీలు డార్క్ ఎడిషన్ కలిగి ఉండగా, తాగా కర్వ్‌ని కూడా ఈ ఎడిషన్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా వచ్చి కర్వ్ ‘‘బ్లాక్ బ్యూటీ’’ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.