భారత రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన వ్యక్తిత్వం నరేంద్ర మోదీ ప్రస్థానం సామాన్యమైనది కాదు.. అది ఒక పోరాటం, ఒక సంకల్పం. ఇప్పుడు అదే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి, “మా వందే” పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక బయోపిక్ లా కాకుండా, వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. సాధారణంగా బయోపిక్స్ అంటే రాజకీయ ఎత్తుగడలు, విజయాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ, దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ ఈ చిత్రాన్ని ఒక భిన్నమైన కోణంలో ఆవిష్కరిస్తున్నారు. “ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది” అనే లోతైన సందేశంతో, మోదీ వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాలను, ఆయన ఎదుగుదల వెనుక ఉన్న యదార్థ ఘటనలను సహజంగా చూపించబోతున్నారు.
Also Read:Nari Nari Naduma Murari: సంక్రాంతి మళ్లీ మొదలయ్యింది.. అసలైన ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’!
ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రను మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తుండటం విశేషం. ఆయన లుక్ మరియు పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు భాగస్వాములయ్యారు. నటీనటుల విషయానికొస్తే రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా, హాలీవుడ్ స్టార్ జేసన్ మమొవా (ఆక్వామ్యాన్ ఫేమ్) ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదింపుల్లో ఉండటం ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను తెలియజేస్తోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌లను ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వీఎఫ్ఎక్స్ (VFX) పనితనంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.