Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jammu Kashmir: జమ్మూలో 30 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..
Jammu Kashmir: చలికాలాన్ని ఆసరాగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారని చెబుతున్నాయి. 40 రోజుల అత్యంత కఠినమైన శీతాకాల దశ అయిన ‘‘చిల్లై కలాన్’’ సందర్భంగా భారత సైన్యం తీవ్రవాద నిరోధక ఆపరేషన్లను వేగవంతం చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని ఉపయోగించుకోకుండా ఉగ్రవాదుల్ని నిరోధించడానికి భద్రతను కట్టుదిట్టం చేసింది. Read Also: రూ.9000కే 6000mAh […] -
Droupadi Murmu: చరిత్ర సృష్టించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్‌లో జలాంతర్గామిలో ప్రయాణించారు. కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ అయిన INS వాఘషీర్‌లో రాష్ట్రపతితో పాటు నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా ప్రయాణించారు. జలాంతర్గామిలో సముద్రంలోకి వెళ్లిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అంతకుముందు, ఫిబ్రవరి 2006లో జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం నిలిచారు. -
Bangladesh: ఉస్మాన్ హాది హంతకులు భారత్ పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు..
Bangladesh: బంగ్లాదేశ్‌కు చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య ఆ దేశంలో హింసకు కారణమైంది. భారత్‌పై ఆరోపణలు నెడుతూ, అక్కడి మతోన్మాద మూక ఇండియన్ ఎంబసీపై కూడా దాడులకు పాల్పడింది. దైవదూషన ఆరోపణలపై అక్కడి మైనారిటీ హిందువులను హత్య చేసింది. ఇదిలా ఉంటే, హాది హత్యకేసులో ఇద్దరు ప్రధాన అనుమానితులు హత్య తర్వాత మేఘాలయ సరిహద్దు ద్వారా భారత్ పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. -
Asif Ali Zardari: పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ‘‘ఆపరేషన్ సిందూర్‘‘.. ఆ దేశ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
Asif Ali Zardari: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు సలహా ఇచ్చారని అన్నారు. -
High Court: “కొడుకు”ను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని శిక్షించే చట్టాలు లేవు..
High Court: కొడుకు తప్పు చేసిన రక్షించే తల్లులను శిక్షించే చట్టాలు లేవని పంజాబ్-హర్యానా కోర్టు వ్యాఖ్యానించింది. ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన కొడుకును రక్షించేందుకు ఆధారాలు నాశనం చేయాలని చూసిన తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడైన కొడుకుకు మరణశిక్షను రద్దు చేసి, జీవితఖైదు (30 సంవత్సరాలు రిమిషన్ లేకుండా), రూ. 30 లక్షల జరిమానాను విధించింది. అదే సమయంలో అతడి తల్లిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. -
Woman Kills Daughter: ‘‘మరాఠీ’’ మాట్లాడలేదనే కోపంతో కుమార్తెను హత్య చేసిన తల్లి..
Woman Kills Daughter: భాష అంటే అభిమానం ఉండాలి, కానీ అది ఉన్మాదంగా మారకూడదు. ఇటీవల కాలంలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడకుంటే దాడులు జరిగిన సంఘటనలు జరిగాయి. అయితే, తాజాగా జరిగిన ఘటన మాత్రం భాషోన్మాదానికి పరాకాష్ట. ఒక మహిళ తన ఆరేళ్ల కూతురు సరిగ్గా మరాఠీ మాట్లాడలేదనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గొంతునులిమి హత్యకు పాల్పడింది. సుదీర్ఘ విచారణ తర్వాత, ఆ మహిళ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది. -
Eggs Prices: ఆకాశాన్ని అంటుతున్న ‘‘కోడిగుడ్డు’’ ధరలు.. కారణాలు ఏంటి?, ఎప్పుడు తగ్గుతాయి?
Eggs Prices: గతంలో రూ. 6, రూ. 7 లకు దొరికే ‘కోడిగుడ్డు’ ధర ఇప్పుడు రూ. 8కి చేరింది. అయితే, ఇలా ఎందుకు పెరుగుతున్నాయని సాధారణ వినియోగదారుడి మదిలో ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో, నగరాల్లో ఎగ్స్ రేట్లు పెరిగాయి. -
Boxing Day tsunami: 23,000 అణుబాంబులు పేలితే ఎలా ఉంటుందో, అదే 2004 సునామీ..
Boxing Day tsunami: సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఇండోనేషియా సముద్రంలో సంభవించిన భూకంపం యావత్ ప్రపంచాన్ని భయపెట్టింది. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. అప్పటి వరకు ‘‘సునామీ’’ అంటే ఏమిటో తెలియని ప్రజలకు, అది ఎంత ఘోరంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది. -
Jammu Kashmir: కాశ్మీర్లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ లోని ఒక స్థానిక మార్కెట్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరేతోయిబాకు చెందిన ఉగ్రవాది కనిపించడంతో భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. మార్కెట్ ప్రాంతంలోని ఒక సీసీటీవీ కెమెరాలో ఉగ్రవాదులకు సంబంధించిన చిత్రాలు నమోదయ్యాయి. -
Pakistan: పాకిస్తాన్‌కు డాక్టర్లు, ఇంజనీర్లు గుడ్‌బై.. అసలు కారణాలు ఏంటి.?
Pakistan: పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ నుంచి మేథోపరమైన వలసలు(టాలెంట్ ఎక్సోడస్)ను ఎదుర్కొంటోంది. దేశంలోని ప్రతిభావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు విదేశాలకు వెళ్తున్నారు. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది. అయితే, ఈ పరిస్థితిపై పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన ‘‘బ్రెయిన్ గెయిన్’’ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. […]
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!