Tata Curvv Dark Edition: దేశీయ ఆటోమేకర్ టాటా, తన కూపే SUV అయిన కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే, టాటాలో నెక్సాన్, హారియర్, సఫారీలు డార్క్ ఎడిషన్ కలిగి ఉండగా, తాగా కర్వ్‌ని కూడా ఈ ఎడిషన్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా వచ్చి కర్వ్ ‘‘బ్లాక్ బ్యూటీ’’ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ ఎస్‌యూవీ నెక్సాన్ కంటే కొత్త ఫీచర్లనను కలిగి ఉంది. ఇంటీరియర్స్ మరింత ప్రీమియంగా ఉన్నాయి. కర్వ్ ఎంపిక చేయబడిన కొన్ని వేరియంట్లలో మాత్రమే అమ్మకానికి వస్తోంది.
టాటా కర్వ్ డార్క్ ఎడిషన్: వేరియంట్స్, ధరలు..
టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ కేవలం రెండు ట్రిమ్స్‌లో లభ్యమవుతోంది. అకంప్లిష్‌డ్, అకంప్లిష్‌డ్ +A అందుబాటులో ఉంది. ఈ రెండింటిలో కూడా టర్బో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. 1.2L హైపెరియన్ GDi పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ ధర రూ. 16.49 లక్షల నుంచి ప్రారంభమై ఆటోమేటిక్ ధర రూ. 19.47 లక్షల వరకు ఉంటుంది. 1.5 క్రయోజెట్ డీజిల్ వేరియంట్ ధర ట్రాన్స్‌మిషన్, ట్రిప్ స్థాయిని బట్టి రూ. రూ.17.99 లక్షల నుండి రూ.19.52 లక్షల మధ్య ఉంటుంది. సిట్రియోన్ బసాల్ట్‌కి టాటా కర్వ్ పోటీని ఇస్తుంది. GDi పెట్రోల్ ఇంజన్ 125 Hp, 225 Nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజన్ 118 Hp, 260 Nm పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఎక్స్‌టీరియర్స్ ఇప్పుడు చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. పియానో బ్లాక్ ఇన్సర్ట్ క్రోమ్ ఎలిమెంట్ చాలా స్టైలిష్‌గా ఉంది. క్యాబిన్ పూర్తిగా బ్లాక్ థీమ్ లో ఉంది. దీంట్లో డ్యుయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, సన్‌షేడ్ వంటివి కలిగి ఉన్నాయి.