Bengaluru: బెంగళూర్ నగరంలో ఇటీవల ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి.
Cyber attack: మయన్మార్ భూకంప రెస్క్యూలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) విమానాలపై సైబర్ దాడి జరిగింది. ఐఏఎఫ్‌కి చెందిన C-130J విమానం మయన్మార్‌లో ప్రయాణిస్తున్నప్పుడు GPS-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన రితేష్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Laser weapon: భారత అమ్ములపొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. లేజర్ డైరెక్టెడ్ వెపన్(DEW) MK-II(A), సులభంగా చెప్పాలంటే లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తయారు చేసిన వ్యవస్థ ముఖ్యంగా ‘‘డ్రోన్’’లను టార్గెట్ చేస్తుంది. డ్రోన్లను ట్రాక్ చేసి, లేజర్ బీమ్‌ని ఉపయోగించి టార్గెట్‌ని నాశనం చేస్తుంది.
BJP: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మోడీని ‘‘సంఘీ’’ అంటూనే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాదులు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీకి చెందిన డానిష్ ఇక్బాల్ కన్హయ్య కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ ఆదివారం అతడిపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Bengal Violence: గత కొన్ని రోజులుగా బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 150 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
Bengal Waqf Clashes: బెంగాల్ వక్ఫ్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో భారీగా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. చాలా మంది హిందువులు ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tarun Chugh: బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక అల్లర్లపై మమతా బెనర్జీ ఏం చేయడం లేదని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. హింసకు మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తోంది. బెంగాల్లో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరిగిన వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింస చోటు చేసుకుంది.
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆదివారం సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 21 మంది మరణించగా, 83 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌లో జరిగిన భయంకరమైన దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ఖండించారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.