UP: ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్‌లో శనివారం బుర్ఖా ధరించిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఒక హిందూ అబ్బాయితో బైక్‌పై ప్రయాణిస్తున్న ముస్లిం అమ్మాయిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు బాధితులు కూడా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. లోన్ రికవరీ కోసం వెళ్లి వస్తుండగా అడ్డగించిన కొందరు వ్యక్తులు వారి పేర్లు అడిగారు. అబ్బాయి సచిన్ హిందువు అని తెలుసుకుని కొట్టారు. అమ్మాయి బుర్ఖాని తీసేయాలని వేధించారు.
Read Also: Daayra : బాలీవుడ్ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ గ్రీన్ సిగ్నల్
ఇద్దరినీ సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లి హిందూ వ్యక్తిని కొట్టారని ఆరోపించారు. ఆ తర్వాత ఆరుగురిలో ఒకరు ఆ అమ్మాయి బుర్ఖాను తొలగించారు. నిందితుడు ఆ మహిళ జుట్టును లాగి, ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. సంఘటనా స్థలంలో గుమిగూడిన జనం ఇద్దరిని కాపాడినట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులు ఉత్తర్ ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్నారని మరిచిపోయినట్లు ఉన్నారు. ఇలాంటి నిందితులకు పోలీసులు యోగి మార్క్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో చూపించారు. అమ్మాయిని వేధించిన నిందితులకు చెందిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరుగురు నిందితులు పోలీస్ స్టేషన్‌లో కుంటుతూ, క్షమాపణలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాడి చేసిన ఆరుగురు నిందితులను సర్తాజ్, షాదాబ్, ఉమర్, అర్ష్, షోయబ్, షమీగా గుర్తించారు.
यूपी : मुजफ्फरनगर में मुस्लिम युवती का बुर्का उतरवाने वाले 6 मुस्लिम युवकों की ये Video पुलिस ने जारी की है, इसमें वो लंगड़ाते नजर आ रहे हैं।@AnujTyagi8171 https://t.co/X67G0NM9VB pic.twitter.com/NnnQrpaXMb
— Sachin Gupta (@SachinGuptaUP) April 13, 2025