Mohan Bhagwat: హిందూ సమాజంలో కుల భేదాలు అంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. హిందువులకు ‘‘ఒక ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక" అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని అన్నారు.
Akhilesh Yadav: ఇండీ కూటమిపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప ఇండి కూటమి సంకీర్ణం కొనసాగుతుంది ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. వక్ఫ్ బిల్లు ద్వారా మాఫియా లాగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూర్‌లోని తన ఇంట్లో శవంగా కనిపించాడు. అతడి ఒంటిపై పలు చోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. అతడి భార్య పల్లవి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని వారి నివాసంలో పల్లవి, ఓం ప్రకాష్‌ని హత్య చేసినట్లు తెలుస్తోంది.
Nitesh Rane: మహారాష్ట్రలో జాతీయ విద్య విధానం(ఎన్ఈపీ) అమలులో భాగంగా మరాఠీ, ఇంగ్లీష్‌తో పాటు హిందీని తప్పనిసరి చేయడాన్ని రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదమే, ఇప్పుడు మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలకు కారణమవుతోంది.
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత, ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాని అప్పగించాలని పలుమార్లు భారత్‌ని కోరింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించింది.
Canada: ఖలిస్తానీలకు అడ్డాగా ఉన్న కెనడాలో అరాచకం సృష్టిస్తున్నారు. వాంకోవర్‌లో ఒక గురుద్వారాపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. గురుద్వారాపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో రాతలు రాశారు. ఈ సంఘటన వాంకోవర్‌లోని ఖల్సా దివాన్ సొసైటీ లేదా KDS గురుద్వారాలో జరిగింది, దీనిని రాస్ స్ట్రీట్ గురుద్వారాగా పిలుస్తారు. సిక్కు దేవాలయం పార్కింగ్ స్థలం చుట్టూ ఉన్న గోడపై అనేక చోట్ల ‘‘ఖలిస్తాన్’’ అనే పదాన్ని స్ప్రే పెయింట్ చేసినట్లు గురుద్వారా పరిపాలన అధికారులు చెప్పారు. Read […]
BJP MP: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్‌లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్‌కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
Pakistan: పాకిస్తాన్లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం పడుతుందని అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, సింధ్ ప్రావిన్సు గుండా ప్రయాణిస్తున్న సమయంలో కోహిస్తానీపై దాడి జరిగింది.
UP News: తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్సయిందని అతను బాధ పడుతుంటే, భార్య మాత్రం తన లవర్‌లో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలుసుకున్నాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్‌లో జరిగింది. రోరావర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శివ శంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లు ధ్రువీకరించారు.