Venu Goapl Reddy
Author- NTV Telugu-
Iran: “మీ రికార్డులు మాకు తెలుసులేవోయ్”.. యూఎస్‌పై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు..
Iran: ఇరాన్లో సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంపై మొదలైన నిరసనలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. అయితే, ఈ ప్రజల తిరుగుబాటుకు అమెరికా, ఇజ్రాయిల్ మద్దతు తెలుపుతున్నాయి. -
Tamil Nadu: తమిళనాట “ఎల్టీటీఈ” ప్రభాకరన్ ఫోటో వివాదం.. ఇరకాటంలో కాంగ్రెస్..
Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారాలను ప్రారంభించాయి. మార్చి/ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షం ఎండీఎంకే అధినేత వైకో తిరుచిరాపల్లి కేంద్రంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన ప్రచార బ్యానర్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ఉండటం సంచలనంగా మారింది. -
Congress: ‘‘వినాశక దారిలో కాంగ్రెస్’’.. తమిళనాడు ఎంపీ జోతిమణి వార్నింగ్..
Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి విధానాలను పాతిపెట్టడానికి ఏ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల గురించి వదిలిపెట్టి, వర్గపోరాటాల్లో నిమగ్నమై, తమిళనాడు కాంగ్రెస్ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం […] -
Rajnath Singh: ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’పై రక్షణ మంత్రి ఆందోళన..
Rajnath Singh: దేశంలో ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’ ఆందోళన కలిగిస్తోందని, విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్‌ను ఆయన ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు, కుట్రదారులు అంతా హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులుగా తేలింది. -
Himachal Pradesh: విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్.. ఉసురు తీసిన ప్రొఫెసర్, తోటి స్టూడెంట్స్..
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థిని లైంగిక వేధింపులు, ర్యాగింగ్ భూతానికి బలైంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, తోటి విద్యార్థినుల ర్యాగింగ్ బాధను బాధితురాలు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసింది. ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు మానసికంగా ఎలా వేధించారనే విషయాలను ఈ వీడియోలో చెప్పింది. ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సెప్టెంబర్ 18న […] -
Kim Jong Un: కిమ్ తర్వాత ఉత్తర కొరియా అధికారం ఈమెదే..
Kim Jong Un: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశ ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందని కూడా తెలియదు. అలా అక్కడ కిమ్ జోంగ్ ఉన్ తన ఉక్కు పాలనను కొనసాగిస్తున్నారు. చిత్రవిచిత్రమైన చట్టాలు, కఠినమై రూల్స్, క్షిపణి ప్రయోగాలకు కేరాఫ్‌గా ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రజలు, సైన్యం, అధికారులకు దైవ సమానుడు. కిమ్ మాత్రమే కాదు కిమ్ నాన్న, తాతలను కూడా ఉత్తర కొరియా గౌరవించాల్సిందే. ఎవరైనా నిరాకరిస్తే వాడి చావు జైలు లోనే. -
BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..
BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, భారత వ్యతిరేకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ.. యూఎస్ చట్టసభ సభ్యురాలు జానిస్ షాకోవ్స్కీతో ఆయన ఉన్న ఫోటోను ప్రస్తావించింది. ఈ వారం షాకోవ్క్సీ 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు అనుకూలంగా ఒక లేఖపై సంతకం చేశారు. ఉమర్ ఖలీద్‌ను విడుదల చేయాలని కోరుతూ, మరో ఏడుగురితో కలిసి ఆమె సంతకం చేశారు. -
Iran Protests: “ఒక్కరు చనిపోయినా, అమెరికా రెడీగా ఉంది”.. ఇరాన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..
Iran Protest: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని సిటీల్లో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’ అంటూ ఖమేనీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. -
S Jaishankar: ‘‘చెడ్డ పొరుగువారు’’.. పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది..
S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ను ‘‘చెడు పొరుగుదేశం’’గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడితే దాడులు చేస్తామని హెచ్చరించారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడుతూ, "మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎవరూ చెప్పలేరు" అని మంత్రి ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి అన్నారు. -
Balochistan: పాక్ గడ్డ నుంచి భారత్‌కు తిరుగులేని మద్దతు.. జైశంకర్‌కు బలోచ్ నేత బహిరంగ లేఖ..
Balochistan: భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖలో, బెలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!