Madvi Hidma: మావోయిస్టు హిడ్మా ఉత్థాన పతనాలు.. ఉద్యమంలో ముగిసిన క్రూర అధ్యాయం..
- మావోయిస్ట్ ఉద్యమంలో ముగిసిన హిడ్మా శకం..
- క్రూర అధ్యాయానికి తెర..
- ఎన్నో దాడులకు రూపశిల్పిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madvi Hidma: ఇరవై ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగి, బస్తర్ ఏరియాను కంచుకోటగా మలుచుకున్న మాడావి హిడ్మా, ఆంధప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మోస్ట్ వాంటెండ్ మావోయిస్టుగా భద్రతాదళాలకు కొరకురాని కొయ్యగా మారిన హిడ్మాను ఎట్టకేలకు అంతమొందించారు. మావోయిస్టు ఉద్యమంలో అందరిది ఒక దారైతే, హిడ్మాది మరో ప్రత్యేకమైన శైలి. అతడి దాడులు భయంకరంగా ఉండేవి. అదే సమయంలో దాడుల వ్యూహరచన, భద్రతా బలగాలకు కూడా అంతుచిక్కేది కాదంటే అతిశయోక్తి కాదు.
బస్తర్ ఏరియాలోని గిరిజనులు మావోయిజం బాట పట్టడానికి ఇతడి స్పూర్తి కూడా ఒక కారణమే. అప్పటి వరకు మావోయిస్టు అగ్రనాయకత్వంలో ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉండేవారు. హిడ్మా రాకతో ఇది మారింది. మావోయిస్టుల్లో అత్యంత కీలకమైన PLGA “బెటాలియన్ నం.1”కు కమాండర్‌గా ఎదిగాడు. ఇలాంటి ఓ కరడుగట్టిన మావోయిస్టు ఛత్తీస్‌గఢ్-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని దట్టమైన మారేడ్‌మిల్లి అడవులలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. ఇతడితో పాటు భార్య రాజక్క, నలుగురు సన్నిహితులు కూడా హతమయ్యారు.
Also Read
- Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
- AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!
- Sam Pitroda Praises PM Modi: ప్రధాని మోడీపై సామ్ పిట్రోడా ప్రశంసలు.. ‘దయగల, కష్టపడే వ్యక్తి’ అంటూ కీలక వ్యాఖ్యలు
- PM Modi: 2047 డెడ్‌లైన్.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.. మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు
క్రూరమైన దాడులకు పేరు:
2010 ఏప్రిల్‌లో తాడిమెట్లలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. మావోయిస్టు-భద్రతా దళాల చరిత్రలో అత్యంత దారుణమైన దాడిగా దీనిని అభివర్ణిస్తారు. ఈ దాడికి ప్లాన్ చేసిన వ్యక్తి హిడ్మా అని భావిస్తారు. దీంతో పార్టీలో ఒక్కసారిగా హిడ్మా శకం మొదలైంది. మావోయిస్టు గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది.
2013లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్, ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సహా 30 మంది మృతి చెందారు. దీని వెనక కూడా హిడ్మా హస్తం ఉందని అంతా నమ్ముతారు. ఈ దాడుల వల్లే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నుంచి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో చేరాడు. బీజాపూర్, సుక్మా, దంతెవాడ, దక్షిణ బస్తర్ అంతటా మావోయిస్టుల కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. 2017లో బుర్కపాల్ దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. విన్పాలో, టేకులగూడ దాడుల్లో 21 మంది మరణించారు.
16వ ఏళ్లలో ఉద్యమంలోకి:
బీజీపూర్ జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూవర్తి గ్రామంలో పుట్టిన హిడ్మా, తన 16వ ఏటనే మావోల ‘‘బాల్ సంగం’’ ద్వారా మావోయిస్టుల్లో చేరాడు. అసాధరణ గెరిల్లా వ్యూహాలు హిడ్మా అటాకింగ్ స్టైల్. ఇతడికి గోండి, హల్బీ, హిందీ, తెలుగు, కొంచె మరాఠీ భాషలు వచ్చు. విద్య లేకప్పటికీ సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు. ఇతన వద్ద ఒక ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్, కొన్నిసార్లు కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు ఉంటాయని మాజీ సహచరులు చెబుతుంటారు.
ఇప్పటి వరకు భద్రతా బలగాలు ఆరుసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. ఈ ప్రయత్నాల్లో 100 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ప్రతీసారి హిడ్మా పోలీసుల్ని తప్పించుకున్నాడు. ఇతడికి నాలుగు నుంచి ఐదు దశల సెక్యురిటీ ఉంటుంది. ఇతడిని గుర్తించడం దాదాపుగా అసాధ్యంగా ఉండేది. పోలీసులు వద్ద 25 ఏళ్ల నాటి పాత ఫోటో మాత్రమే ఉండేది. తన దళంలోని ప్రతీ సభ్యుడిని నవ్వతూ మాట్లాడుతూ, గౌరవిస్తూనే, భయంకరమైన దాడులు నిర్వహించేవాడు. కేంద్ర కమిటీలో ఎదిగిన ఏకైక తెలంగాణేతర గిరిజనుడు ఈయనే.
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ:
ఇలాంటి క్రూర చరిత్ర ఉన్న, భయంకరమైన మావోయిస్ట్ నేత మారేడుమిల్లి అడవుల్లో హతమయ్యచాడు. భారతదేశ మోస్ట్ వాంటెంట్ హిడ్మా హతంతో భద్రతా బలగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇతడి చేతుల్లో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ రోజు ఒకింత ఉపశమనం లభించినట్లైంది. హిడ్మా హతం దేశంలో మావోయిజానికి పెద్ద మొట్టుగా అభివర్ణించవచ్చు.
తాజావార్తలు
-
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
-
Soil: మట్టి…! బంగారం కంటే ఎందుకు విలువైంది?
-
Vivo X500 Series: వివో X500 Series ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ
-
Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
ట్రెండింగ్
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..