Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ‘‘ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు’’ భారత్‌పై దాడులు చేస్తామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇటీవల, ఎర్రకోట ఉగ్రదాడిని ప్రస్తావిస్తోంది. డాక్టర్ ఉగ్రవాది ఉమర్ నబీ ఆత్మాహతికి పాల్పడి, 14 మంది ప్రాణాలు తీశాడు. ఇతడికి జైష్‌తో సంబంధాలు ఉన్నాయి.
Read Also: Bhuvneshwar Kumar: ఇప్పుడేం కొత్త కాదుగా.. కోల్‌కతా పిచ్‌పై భువీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
హక్ వ్యాఖ్యలు ఇటీవల ఎర్రకోట దాడితో పాటు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని కూడా ప్రస్తావిస్తున్నాయి. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పో్యారు. లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు బాధ్యత ప్రకటించుకుంది. ఇప్పుడు హక్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘మీరు బలూచిస్తాన్‌ను రక్తస్రావం చేస్తూనే ఉంటే, ఎర్రకోట నుండి కాశ్మీర్ అడవుల వరకు భారతదేశాన్ని తాకిస్తామని నేను ఇంతకు ముందే చెప్పాను. అల్లా దయతో, మేము దీన్ని చేసాము. వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించలేకపోతున్నారు.’’ అని అన్నారు. కొన్ని రోజుల క్రితం సాయుధ వ్యక్తులు ఢిల్లీలోకి ప్రవేశించి దాడి చేశారు, వారు ఇప్పటికీ మృతదేహాలను లెక్కించుకుంటున్నారని అని అన్నారు.
పాకిస్తాన్ బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల అశాంతి వెనక భారత్ ఉందని ఆరోపిస్తోంది. బలూచ్‌లో స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ లిబరేషర్ ఆర్మీ(బీఎల్ఎఫ్) పాక్ సైన్యం టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు ఆ దేశ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. సొంత దేశంలో అశాంతిని కట్టడి చేయలేని పాకిస్తాన్, ఆ నిందల్ని భారత్‌పై తోస్తోంది.