Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna River Management Board: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై అత్యవసరంగా చర్చించేందుకు బోర్డు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది నీటి లభ్యతపై అనిశ్చితి ఉండే అవకాశం ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను స్పష్టంగా ఖరారు చేసి, తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.
కృష్ణా జలాల పంపకాలే ఏకైక అజెండాగా కేఆర్ఎంబీ సమావేశం లేదా త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై స్పష్టత తీసుకురావడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొంది. కృష్ణా జలాల వినియోగంపై త్వరితగతిన చర్చలు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!