Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా సవరించింది. మునుపటి షెడ్యూల్లో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఉండగా, తాజాగా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా కొత్తగా చేర్చారు. దీనివల్ల భారత జట్టు మరో వారం రోజుల పాటు దక్షిణాఫ్రికాలోనే అదనంగా గడపాల్సి ఉంటుంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9 నుండి 12 వరకు గెబెర్హాలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 16 నుండి 22 మధ్య మూడు వన్డేల సిరీస్ (పార్ల్, కేప్‌టౌన్, బ్లోమ్ఫోంటెన్లలో) నిర్వహిస్తారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుండి 30 వరకు బెనోని, పోచెఫ్‌స్ట్రూమ్‌లలో మూడు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంక వేదికగా జరగనున్న తొలి ‘ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ’ టోర్నీకి సరైన ముందస్తు సన్నాహకంగా ఈ టి20 సిరీస్ ఉపయోగపడుతుందని క్రికెట్ సౌతాఫ్రికా భావిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటైన భారత్‌తో మూడు ఫార్మాట్లలోనూ పోటీపడడం తమ ఆటగాళ్లకు ఎంతో కీలకమైన అనుభవాన్ని ఇస్తుందని సీఎస్ఏ సిఈఓ ఫోలెట్సీ మోసెకి తెలిపారు.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
గతంలో జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన టి20 సిరీస్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4-1 తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో కూడా సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!