Asaduddin Owaisi: హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వరసగా గెలుస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇందుకు ప్రతిపక్షాల వైఫల్యం కూడా కారణమవుతుందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అవునా..? అని ప్రశ్నించిన సమయంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరుచుగా ప్రతిపక్షాలు ఎంఐఎంపై చేసే ఈ ఆరోపణలపై ఓవైసీ స్పందిస్తూ.. ఇది తనను నిందించడానికి, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీ పట్ల ప్రతిపక్షాల ద్వేషం తప్ప మరొకటి కాదని అన్నారు.
Lightning: ఛత్తీస్‌గఢ్ ధమ్తారి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తి ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. పిడుగుపడి తీవ్రగాయాలైన వ్యక్తిని సమీపం ఆస్పత్రికి తరలించారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, మార్గం మధ్యలోనే అతను మరణించాడు. బాధితుడిని రోహిత్ కుమార్ సిన్హాగా గుర్తించారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమె పార్టీ ఆవామీ లీగ్, ఆమె మద్దతుదారుల్ని టార్గెట్ చేసిన యూనస్ ప్రభుత్వం, తాజాగా బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను ఢాకాలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఆమెను ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, థాయ్‌లాండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. Read Also: Russia: 11 ఏళ్ల విద్యార్థితో […]
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్థానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే పలువురు భారత్ వ్యతిరేక టెర్రరిస్టుల్ని హతమారుస్తున్న వీరు, తాజాగా లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్‌ని హతమార్చారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఇతడిని హతమార్చారు. భారత్‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మూడు ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక కుట్రదారుగా ఉన్నాడు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలను మరింత రెట్టింపు చేవారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న హిమంత, ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, ఇది తీవ్రమైన విషయమని శర్మ ఆరోపించారు.
BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.
Shahid Afridi: భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా పాకిస్తాన్ తమకు ఏం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలకు హాజరవుతున్నారు. భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. పీఓకే, పాక్ భూభాగాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందిని హతమార్చింది. అయినా కూడా ఏం జరగనట్లు పాకిస్తాన్ తన ప్రజల్ని మోసం చేస్తోంది.
Bangladesh: భారత్ అంటేనే ద్వేషంతో రగిలిపోతున్నాడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇతను భారత్ వ్యతరేక ప్రచారాన్ని బంగ్లాదేశ్‌లో ముమ్మరం చేశాడు. భారత్ అంటే పడని జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీ నేతల్ని తన సలహాదారుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత, భారత ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు. 1970లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహ హస్తం అందిస్తు్న్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ […]
Mohan Bhagwat: భారతదేశం ప్రపంచ సామరస్యానికి, సంక్షేమానికి దృఢంగా కట్టుబడి ఉన్న సమయంలో, ప్రస్తుతం ప్రపంచం భారతదేశ పవర్‌ని చూసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే ‘‘ప్రేమ భాష’’ అర్థమవుతుందని ఆయన అన్నారు.