Donald Trump: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడుల మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరింది. శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై విరుచుకుపడింది. ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌తో పాటు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్ లోని ప్రధాన నగరాలైన జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
Rare Earth Magnet: అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మెటీరియల్)పై చైనా గుత్తాధిపత్యం భారత్‌కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తన కొత్త నివేదికలో హెచ్చరించింది.
Israel Iran War: ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ శుక్రవారం ‘‘ ది రైజింగ్ లయన్’’ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కార్యక్రమ కేంద్రాలు, ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలపై దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 80 మంది వరకు మరణించనట్లు ఇరాన్ ధ్రువీకరించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో […]
Pune Bridge Collapses: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 25మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తోంది. వర్షాకాలం రద్దీగా ఉండే ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
Oil Discovery: ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85 శాతం ఆయిల్‌ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది.
Air India Express: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ప్రమాదం తర్వాత కూడా దేశీయ విమానయాన సంస్థలు తీరు మార్చుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో అత్యంత వేడి వాతావరణంలో, ఏసీలు లేకుండా విమానంలో కూర్చోపెట్టారని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విమానంలో ఉక్కపోతలో 5 గంటలు నరకం అనుభవించామని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
Zipline: నాగ్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబానికి విహారయాత్ర విషాదంగా మారింది. నాగ్‌పూర్‌కి చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం మనాలి టూర్‌కు వెళ్లింది. అయితే, వీరి కూతురు ప్రమాదవశాత్తు జిప్‌లైన్ బెల్ట్ తెగడంతో 30 అడుగుల లోయలో పడిపోయింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్ధామని వెళ్లిన వీరికి ఈ టూర్ పీడకలగా మారింది. ఈ ఘటన జూన్ 8న జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లో జరుగుతున్న మిలిటరీ పరేడ్కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
Israel Iran War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలు టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు దారుణంగా దెబ్బతినడంతో పాటు కీలకమైన అధికారులు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లతో ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంతో పాటు కీలక నగరాలైన టెల్ అవీవ్, […]