Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఎలిమినేట్ చేసింది.
Vijay Rupani: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, రూపానీ రెండు సార్లు తన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి మాత్రం ప్రమాదంలో మరణించారు.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో విమానంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. భారత సంతతి బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు. గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. 11ఏ సీటులో కూర్చొన్న విశ్వేష్ కుమార్ రమేష్ కూర్చొన్నారు.
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.
Israeli Operation: ఇజ్రాయిల్ ఇరాన్‌ని తన అస్తిత్వానికి ముప్పుగా చూస్తోంది. ఇరాన్ చేతికి న్యూక్లియర్ ఆయుధాలు రావద్దనేది ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద విరుచుకుపడుతోంది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలపై, వారి సైంటిస్టులను టార్గెట్ చేసి దాడులు చేసింది. 2005 నుంచి ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం, ఇరాన్ అణ్వాస్త్రాలకు అవసరమయ్యే యూరేనియాన్ని శుద్ధి చేసినట్లు అనుమానిస్తున్న ఇజ్రాయిల్, భారీ దాడులు చేసింది.
India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్‌తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్‌తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు.
Rajasthan: ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు భర్తలపై అక్రమ గృహహింస కేసుల పెట్టి వేధిస్తున్నారు. దీంతో పలువురు మగాళ్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు ఇందుకు మంచి ఉదాహరణ. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌కి చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ కూడా తన భార్య నుంచి ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తప్పుడు కేసులో విసిగిపోయిన కృష్ణ వినూత్నంగా తన నిరసన తెలుపుతున్నాడు.
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ లోని అతిపెద్ద నగరమైన టెల్ అవీవ్‌ని ఇరాన్ క్షిపణులతో టార్గెట్ చేసింది. అయితే, ఇప్పుడు ఇజ్రాయిల్ పొరపాటున చేసిన పనికి భారతదేశానికి ‘‘క్షమాపణలు’’ చెప్పింది. భారతదేశ పటాన్ని ఇజ్రాయిల్ తప్పుగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలు నేపాల్‌లో భాగంగా చూపించింది.
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలను, కీలక శాస్త్రవేత్తలు, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం, ఇజ్రాయిల్ అతిపెద్ద నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. టెల్ అవీవ్‌తో పాటు రాజధాని జెరూసలెంలో కూడా పేలుళ్లు జరిగాయి. మరోవైపు, 24 గంటల్లోనే ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్‌పై భీకర దాడి చేసింది. రాజధాని టెహ్రాన్ లోని ఎయిర్…
Bangladesh: బంగ్లాదేశ్‌లోని కవి, బహుభాషావేత్త, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై మతోన్మాదులు దాడులు చేశారు. సిరాజ్గంజ్ జిల్లాలోని ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం ఒక సందర్శకుడు, మ్యూజియం సిబ్బందికి పార్కింగ్ ఫీజు విషయంలో జరిగిన వివాదం తర్వాత, ఒక గుంపు దాడికి పాల్పడింది. సందర్శకుడిని నిర్బంధించిన తర్వాత దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఒక గుంపు ఆవరణలోకి చొరబడి మ్యూజియం, ఆడిటోరియంపై దాడులకు పాల్పడింది.