Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274 మంది మరణించారు. ఇందులో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలో ఉన్నవారు కూడా మరణించారు. విమానం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో, హాస్టల్లోని మెడికోలు మరణించారు.
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టింది. గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది మరణించారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. విమానం డాక్టర్ హాస్టల్ భవనంపై కూలడంతో 24 మంది మెడికోలు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు.
Israel Strikes: ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. 24 గంటల్లో మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలపై ఎటాక్ చేసింది. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలతో సహా 200కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడులు చేసినట్లు తెలిపింది.
Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల గురించి తమకు ముందే సమాచారం ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీతో సహా అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. ఇరాన్ తిరిగి చర్చల టేబుల్‌పైకి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
Air Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. దీంతో గుజరాత్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. అయితే, విజయ్ రూపానీలాగే గతంలో కూడా భారత రాజకీయ ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారు.
Assam tension: ఈద్ రోజున కొందరు దుండగులు హిందువులు ఆలయాలు, ప్రాంతాలను అపవిత్రం చేయడం అస్సాంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేరస్తులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. ‘‘షూట్-అట్-సైట్’’ ఆదేశాలు జారీ చేశారు.
oneymoon Murder Case: గత కొన్ని రోజులుగా హనీమూన్ మర్డర్, సోనమ్ రఘువంశీ దారుణం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరులో మేఘాలయకు తీసుకెళ్లి హతమార్చింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఈ క్రూరమైన ప్లాన్‌ని అమలు చేసింది. రాజను హత్య చేయడానికి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నిందితులు నియమించుకున్నారు. మే 23న రాజా మిస్సింగ్ ఘటన వెలుగులోకి రాగా, జూన్ 02న ఆయన మృతదేహాన్ని ఖాసీ కొండల్లో గుర్తించారు.
Air India flight crash: ఎయిరిండియా విమాన ప్రమాదం 265 మంది మరణించారు. ఎందరో కలల్ని ఈ ప్రమాదం చెరిపేసింది. కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్లకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత్ గోపకుమార్ పెట్టుకున్న ఆశలన్ని కూలిపోయాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల్లో రంజిత కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన రంజిత యూకేలో నర్సుగా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం భారతదేశానికి వచ్చింది.
Boeing: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24మమది మెడికోలు మరణించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.