Israel Iran War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలు టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు దారుణంగా దెబ్బతినడంతో పాటు కీలకమైన అధికారులు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లతో ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంతో పాటు కీలక నగరాలైన టెల్ అవీవ్, హైఫా పై దాడులు చేసింది.
Read Also: Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..
శుక్రవారం ప్రారంభమైన ఈ సంఘర్షణ ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం తెల్లవారుజామున ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌లోని ఎస్పీఎన్డీ అణు ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం అయిన ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. అణు అర్కైవ్ దాడి పెట్టిన ప్రదేశాన్ని కూడా టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయిల్ టెహ్రాన్‌లోని అతిపెద్ద చమురు డిపో అయిన షహ్రాన్‌ని టార్గెట్ చేసింది. శనివారం ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం అయిన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని కూడా ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది.
ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఆపరేషన్ “రైజింగ్ లయన్”ను ప్రారంభించిన తర్వాత నుంచి ఇరాన్‌లో 78 మంది మరణించారని, 320 మందికి పైగా గాయపడ్డారని యూఎన్‌లోని ఇరాన్ రాయబారి వెల్లడించారు. మరోవైపు, ఇరాన్ జరిపిన దాడుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు, 300 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది.