Pune Bridge Collapses: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో 25మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తోంది. వర్షాకాలం రద్దీగా ఉండే ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
పూణే జిల్లాలోని మావల్ తాలూకాలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో ఈ టూరిస్టు ప్రాంతానికి వచ్చారు. ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెన పై నుంచి నదీ అందాలను వీక్షిస్తున్న సమయంలో, ఈ ఘటన జరిగింది. వంతెన పై ఉన్న అనేక మంది నదీ ప్రవాహంలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై భారీగా జనాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ సంఘటన తర్వాత, స్థానిక పోలీసులు, విపత్తు ప్రతిస్పందన విభాగాలు, గ్రామస్తుల బృందాలు అత్యవసర సహాయక చర్యను ప్రారంభించాయి. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇది ఇంద్రాయణి నీటి మట్టం మరియు ప్రవాహాన్ని గణనీయంగా పెంచింది, ఇది సహాయక చర్యలను సవాలుగా మార్చింది. కూలిపోయిన వంతెన దశాబ్దాల కాలం నాటిది.
Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund Mala
Read in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR
— Punekar News (@punekarnews) June 15, 2025