F-35B Fighter: ప్రపంచంలో అత్యుత్తమ ఫైటర్ జెట్‌గా చెప్పబడుతున్న అమెరికన్ తయారీ ఎఫ్-35 బీ కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయింది. సాంకేతిక కారణాలతో బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఈ విమానం గత కొన్ని రోజులుగా ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. పలుమార్లు టెక్నీషియన్స్ వచ్చినా ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ ఆకాశంలోకి ఎగరలేకపోయింది. 19 రోజులుగా కేరళలోనే నిలిచిపోయింది. ఇప్పుడు దీనిని తరలించాలని యూకే భావిస్తోంది.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. తిట్టారన్న కోపంతో తల్లి, కొడుకును చంపేసిన పని మనిషి
అయితే, ఇప్పుడు యూకే దీనిని C-17 గ్లోబ్‌మాస్టర్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించే ప్రయత్నాలను అణ్వేషిస్తోంది. అయితే, ఇంత అత్యాధునిక ఫైటర్ జెట్‌గా చెప్పుకుంటున్న ఎఫ్-35ని ఇలా తీసుకెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. 5వ తరం యుద్ధవిమానం, స్టెల్త్ లక్షణాలు ఉన్న, వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ ఫీచర్లు కలిగిన ఈ విమానం, ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌లో మోహరించబడిన రాయల్ నేవీ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు తిరిగి రాలేక కేరళ విమానాశ్రయానికి మళ్లించబడింది.
బ్రిటీష్ హైకమిషన్ చెబుతున్న దాని ప్రకారం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా యుద్ధ విమానం తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండిగ్ అయినట్లు ప్రకటన జారీ చేసింది. ఇండో-యూకే నేవల్ ఎక్సర్‌సైజ్ సమయంలో జూన్ 15న పైలట్ విమానాన్ని తిరువనంతపురంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ల్యాండిగ్ తర్వాత జెట్‌లో ఇంజనీరింగ్ సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిసింది. దీంతోనే అది టేకాఫ్ కాలేకపోయింది.