Gender Change: తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి ‘‘లింగ మార్పిడి’’ చేసుకున్నాడు. అంతా బాగుంది కానీ, ఇప్పుడు ఆ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి తన లవర్ కోసం సర్జరీ చేయించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. అత్యాచారం, శారీరక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ గురువారం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
Read Also: Pune: డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఫ్లాట్‌లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న యువతిని ఏం చేశాడంటే..!
ఈ కేసులో ఫిర్యాదుదారు, నిందితుడు 25 ఏళ్ల వ్యక్తులు. మొదటిసారిగా నర్మదాపురంలో దాదాపు 10 ఏళ్ల క్రితం వీరు కలుసుకున్నారు. వారు కాలా కాలం పాటు కలిసి జీవించారు. స్వలింగ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, రైసేన్ జిల్లాలోని ఒబేదుల్లా గంజ్ నివాసి, సదరు వ్యక్తిని లింగమార్పిడి చేయించుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ తర్వాత, అతడిని పెళ్లి చేసుకుంటా అని మభ్యపెట్టాడు.
ప్రస్తుతం భోపాల్ పోలీసులు సదరు వ్యక్తి ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారం, శారీరక వేధింపుల కింద బీఎన్ఎస్ సెక్షన్లు పెట్టారు. నిందితుడు క్షుద్రపూజలు కూడా చేస్తాడని ఫిర్యాదుదారు తన కంప్లైట్‌లో పేర్కొన్నారు. ఇండోర్‌లోని ఒక ఆస్పత్రిలో లింగమార్పిడి చేయించుకుని వ్యక్తి మహిళగా మారినట్లు పోలీసులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత, నిందితుడు తప్పించుకోవడం ప్రారంభించాడు, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పాడు.